Emta guttu nerabeve yemdaamkaanu

ఎంత గుట్టు నెరపేవే యెందాఁకాను
Language

(॥పల్లవి॥)
ఎంత గుట్టు నెరపేవే యెందాఁకాను
పొంతనే మగనితోఁ గాపురము సేయఁగదే

(॥ఎంత॥)
వుమ్మగిలుఁ జెమటలు వుప్పతిలీ నీమేన
కమ్ముకొన్నవలపు లెక్కడ దాఁచేవే
నెమ్మది నీ తలపోఁత నిట్టూరుపులే చెప్పీ
అమ్మరో నీ విరహ మెట్టడంచుకొనేవే

(॥ఎంత॥)
సురతపు టాసలు చూపులలోన నున్నవి
వరుస నీ తమక మేవంకఁ బెట్టేవే
నిరతపు నీ మర్మాలు నివ్వెరగులే చెప్పీ
సొరిది నీ మోమువాడుచొ ప్పెట్టు మాపేవే

(॥ఎంత॥)
చేవదేరి పులకలు చెక్కలను నిండుకొనె
కావరపు సిగ్గు లేడ గాదెఁబోసేవే
నీ వలమేలుమంగవు నిన్నేలె శ్రీవేంకటేశుఁ -
డీవల మదనచినలేగంపఁగమ్మేవే

(||pallavi||)
ĕṁta guṭṭu nĕrabeve yĕṁdām̐kānu
pŏṁtane maganidom̐ gāburamu seyam̐gade

(||ĕṁta||)
vummagilum̐ jĕmaḍalu vuppadilī nīmena
kammugŏnnavalabu lĕkkaḍa dām̐seve
nĕmmadi nī talabom̐ta niṭṭūrubule sĕppī
ammaro nī viraha mĕṭṭaḍaṁchugŏneve

(||ĕṁta||)
suradabu ṭāsalu sūbulalona nunnavi
varusa nī tamaga mevaṁkam̐ bĕṭṭeve
niradabu nī marmālu nivvĕragule sĕppī
sŏridi nī momuvāḍusŏ ppĕṭṭu mābeve

(||ĕṁta||)
sevaderi pulagalu sĕkkalanu niṁḍugŏnĕ
kāvarabu siggu leḍa gādĕm̐boseve
nī valamelumaṁgavu ninnelĕ śhrīveṁkaḍeśhum̐ -
ḍīvala madanasinalegaṁpam̐gammeve