Emta gijigijisese vimtini neevu

ఎంత గిజిగిజిసేసే వింతిని నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత గిజిగిజిసేసే వింతిని నీవు
మంతనానఁ జేయరాదా మఱి చేఁతలెల్లను

(॥ఎంత॥)
విప్పుచు సెలవులను విన్నపాలుసేయఁగాను
చిప్పిల మోవి యెంగిలిసేసేవు
రెప్పలెత్తి కన్నులను రేసువడి చూడఁగాను
కొప్పువట్టి జారఁదీసి కొసరేవు

(॥ఎంత॥)
పాదములు నీ కొత్తఁగాఁ బడఁతి చన్నుమొనలు
దాదాత(య?) బొట్టనవేళ్లఁ దాఁకించేవు
కాదనక నీకు నూడిగములెల్లాఁ జేయఁగాను
సేదదేరఁ బిరుదుపైఁ జేయిచాఁచేవు

(॥ఎంత॥)
గందము నీకుఁ బూయఁగా కమ్మి యలమేల్ మంగను
కందువ శ్రీవేంకటేశ కాఁగిలించేవు
సందడింపురతులను చవులెల్లాఁ జూపఁగాను
మందలించి కూడి సదమదము సేసేవు

(||pallavi||)
ĕṁta gijigijisese viṁtini nīvu
maṁtanānam̐ jeyarādā maṟi sem̐talĕllanu

(||ĕṁta||)
vippusu sĕlavulanu vinnabāluseyam̐gānu
sippila movi yĕṁgilisesevu
rĕppalĕtti kannulanu resuvaḍi sūḍam̐gānu
kŏppuvaṭṭi jāram̐dīsi kŏsarevu

(||ĕṁta||)
pādamulu nī kŏttam̐gām̐ baḍam̐ti sannumŏnalu
dādāda(ya?) bŏṭṭanaveḽlam̐ dām̐kiṁchevu
kādanaga nīgu nūḍigamulĕllām̐ jeyam̐gānu
sedaderam̐ birudubaim̐ jeyisām̐sevu

(||ĕṁta||)
gaṁdamu nīgum̐ būyam̐gā kammi yalamel maṁganu
kaṁduva śhrīveṁkaḍeśha kām̐giliṁchevu
saṁdaḍiṁpuradulanu savulĕllām̐ jūbam̐gānu
maṁdaliṁchi kūḍi sadamadamu sesevu