(॥పల్లవి॥)
ఎంత దంటతనమయ్య యీ యింతికి
బంతిని యితవేకాక బలిమి చూపీనా
(॥ఎంత॥)
కెలయుచు నింతి నీతో కేరికేరి నవ్వనా
సెలవుల మీదనే చిందుగాక
చెలరేఁగి చెలరేఁగి చేయిచాఁచి పెనఁగినా
కొలఁదివాఁడి కొనగోరి వాఁ(వ్రాఁ?) తగాక
(॥ఎంత॥)
బిరుదులు పచరించి బెట్టిమాఁట లాడినా
వొరయుచుఁ బెదవుల నొయ్యనేకాక
సరసములాడుతాను సంగడిఁగూచుండినా
వురముమీఁద నెక్కి వుండుగాక
(॥ఎంత॥)
సిగ్గులు విడిచి నిన్నుఁజెయివట్టి తీసినా
వొగ్గి నీసాదాలసేవ నొనరుఁగాక
నిగ్గుల శ్రీవేంకటేశనీవు నాపెఁ గూడితిరి
వెగ్గళించి లోఁగినా వియ్యమందీఁగాక
(||pallavi||)
ĕṁta daṁṭadanamayya yī yiṁtigi
baṁtini yidavegāga balimi sūbīnā
(||ĕṁta||)
kĕlayusu niṁti nīdo kerigeri navvanā
sĕlavula mīdane siṁdugāga
sĕlarem̐gi sĕlarem̐gi seyisām̐si pĕnam̐ginā
kŏlam̐divām̐ḍi kŏnagori vām̐(vrām̐?) tagāga
(||ĕṁta||)
birudulu pasariṁchi bĕṭṭimām̐ṭa lāḍinā
vŏrayusum̐ bĕdavula nŏyyanegāga
sarasamulāḍudānu saṁgaḍim̐gūsuṁḍinā
vuramumīm̐da nĕkki vuṁḍugāga
(||ĕṁta||)
siggulu viḍisi ninnum̐jĕyivaṭṭi tīsinā
vŏggi nīsādālaseva nŏnarum̐gāga
niggula śhrīveṁkaḍeśhanīvu nābĕm̐ gūḍidiri
vĕggaḽiṁchi lom̐ginā viyyamaṁdīm̐gāga