Emta bittaraalu yidi yemi seppedi

ఎంత బిత్తరాలు యిది యేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత బిత్తరాలు యిది యేమి చెప్పేది
కాంతుఁడవు నీవు నాకుఁ గలిగివున్నాఁడవు

(॥ఎంత॥)
కూరిములు నీమీఁద గుప్పలు వోసిపోసి
తూరుపెత్తి పోలిచుట్టీఁ దోడుతోడనె
నేరుపునఁ జెమటతో నిలువుఁగొలువునేసి
వూరఁబోసిఁ దమకము లుబ్బరితనానను

(॥ఎంత॥)
మంతనాన నీతోను మాటలెల్లా నాడి యాడి
దొంతిఁబెట్టీ వలపులు తోడుతోడనె
సంతోసాన నీవద్ద సారెకు నవ్వులెల్లాను
సంతఁబెట్టి యమ్మఁజాపి చవులు సేసీని

(॥ఎంత॥)
వొడ్డారాన జన్నుల నిన్నొత్తి పై పైఁ గూడి కూడి
దొడ్డిఁ బెట్టీ వలపులు తోడు తోడనె
జిడ్డుదేర మోవి యాని శ్రీవేంకటేశ మెప్పించె
వడ్డిగొనీ మన్ననల వనిత ని న్నిపుడు

(||pallavi||)
ĕṁta bittarālu yidi yemi sĕppedi
kāṁtum̐ḍavu nīvu nāgum̐ galigivunnām̐ḍavu

(||ĕṁta||)
kūrimulu nīmīm̐da guppalu vosibosi
tūrubĕtti polisuṭṭīm̐ doḍudoḍanĕ
nerubunam̐ jĕmaḍado niluvum̐gŏluvunesi
vūram̐bosim̐ damagamu lubbaridanānanu

(||ĕṁta||)
maṁtanāna nīdonu māḍalĕllā nāḍi yāḍi
dŏṁtim̐bĕṭṭī valabulu toḍudoḍanĕ
saṁtosāna nīvadda sārĕgu navvulĕllānu
saṁtam̐bĕṭṭi yammam̐jābi savulu sesīni

(||ĕṁta||)
vŏḍḍārāna jannula ninnŏtti pai paim̐ gūḍi kūḍi
dŏḍḍim̐ bĕṭṭī valabulu toḍu toḍanĕ
jiḍḍudera movi yāni śhrīveṁkaḍeśha mĕppiṁchĕ
vaḍḍigŏnī mannanala vanida ni nnibuḍu