ఎంత బయలీఁదించేవే యీతని నీవు
(॥పల్లవి॥)
ఎంత బయలీఁదించేవే యీతని నీవు
ఇంత నేరకుండితేను యిల్లాల వవుదువా
(॥ఎంత॥)
చూపులనే సొలసేవు చుట్టమువలె నాపతి
రాఁపుసేసి నీయింటికి రమ్మంటాను
పూఁపచన్నుల నొత్తేవు బొమ్మల జంకించుకొంటా
యేపున ముద్దుటుంగర మిమ్మనియంటాను
(॥ఎంత॥)
కోరి కొంగువట్టేవు కూరిమితో నప్పటిని
ఆరగించ విందుకు రమ్మనియంటాను
గోరనే చెక్కునొక్కేవు గుట్టుతోడ వేఁడుకొంటా
సారమైననీమోవి చవిచూపుమంటాను
(॥ఎంత॥)
వుద్దండానఁ బెనఁగేవు వొడఁబడికగాఁ జెప్పి
వొద్దికై నీపొత్తునఁ గూచుండుమంటాను
కొద్దిమీర నన్ను నేలుకొనె శ్రీవేంకటేశుఁడు
సుద్దు లేమిచెప్పేవే చొక్కఁజేసుకొంటాను
(||pallavi||)
ĕṁta bayalīm̐diṁcheve yīdani nīvu
iṁta neraguṁḍidenu yillāla vavuduvā
(||ĕṁta||)
sūbulane sŏlasevu suṭṭamuvalĕ nābadi
rām̐pusesi nīyiṁṭigi rammaṁṭānu
pūm̐pasannula nŏttevu bŏmmala jaṁkiṁchugŏṁṭā
yebuna mudduḍuṁgara mimmaniyaṁṭānu
(||ĕṁta||)
kori kŏṁguvaṭṭevu kūrimido nappaḍini
āragiṁcha viṁdugu rammaniyaṁṭānu
gorane sĕkkunŏkkevu guṭṭudoḍa vem̐ḍugŏṁṭā
sāramainanīmovi savisūbumaṁṭānu
(||ĕṁta||)
vuddaṁḍānam̐ bĕnam̐gevu vŏḍam̐baḍigagām̐ jĕppi
vŏddigai nībŏttunam̐ gūsuṁḍumaṁṭānu
kŏddimīra nannu nelugŏnĕ śhrīveṁkaḍeśhum̐ḍu
suddu lemisĕppeve sŏkkam̐jesugŏṁṭānu