ఎంత బత్తో నీమీఁద యీరమణికి
(॥పల్లవి॥)
ఎంత బత్తో నీమీఁద యీరమణికి
సంతోసములెల్లా రేఁగ సరసమాడవయ్యా
(॥ఎంత॥)
కొప్పులో విరులు రాలఁ గులికి కులికి నవ్వీ
చప్పుడుగాఁ జెలి నీతో సారెసారెకు
కప్పురపు వాసనలు కడు బుగులు కొనఁగా
చెప్పీ నీకు బ్రియములు చిత్తగించవయ్యా
(॥ఎంత॥)
పయ్యదకొం గిటుజార పలుమారు జెనకీని
వొయ్యారపుఁ జూపులతో వొద్దనే వుండి
వుయ్యాల మంచముపైకి నూరకే సన్నలు సేసీ
చయ్యన నెంత వేడుకో చన వియ్యవయ్యా
(॥ఎంత॥)
సింగారించుకొని వచ్చి చేరి కొలువులు సేసి
సంగతిగా మాటలాడీ సతి నీతోను
రంగుగ శ్రీవేంకటేశ రతి నన్ను నేలితివి
అంగవించి యాకె నిఁక నాదరించవయ్యా
(||pallavi||)
ĕṁta batto nīmīm̐da yīramaṇigi
saṁtosamulĕllā rem̐ga sarasamāḍavayyā
(||ĕṁta||)
kŏppulo virulu rālam̐ guligi kuligi navvī
sappuḍugām̐ jĕli nīdo sārĕsārĕgu
kappurabu vāsanalu kaḍu bugulu kŏnam̐gā
sĕppī nīgu briyamulu sittagiṁchavayyā
(||ĕṁta||)
payyadagŏṁ giḍujāra palumāru jĕnagīni
vŏyyārabum̐ jūbulado vŏddane vuṁḍi
vuyyāla maṁchamubaigi nūrage sannalu sesī
sayyana nĕṁta veḍugo sana viyyavayyā
(||ĕṁta||)
siṁgāriṁchugŏni vachchi seri kŏluvulu sesi
saṁgadigā māḍalāḍī sadi nīdonu
raṁguga śhrīveṁkaḍeśha radi nannu nelidivi
aṁgaviṁchi yāgĕ nim̐ka nādariṁchavayyā