ఎంత బలిమికత్తెవు యేమే నీవు
(॥పల్లవి॥)
ఎంత బలిమికత్తెవు యేమే నీవు
మంతనమాడకుండాను మానిపేవా నీవు
(॥ఎంత॥)
కామించి యాతఁడు నాసంగడి గూచుండెనంటాను
యేమేమి మాటలాడేవే యింతలో నీవు
నీ మగఁడే నాచేతికి నిమ్మపండిచ్చెనంటాను
గామిడిచేఁత చేసేవు కానీవే నీవు
(॥ఎంత॥)
ఇంతలో నాతఁడు మా ఇంటికి వచ్చెనంటాను
యెంతేసి నవ్వులు నవ్వే వేమే నీవు
దొంతరవలపుతో నా తొడపైఁ బండున్నాఁడంటా
పంతములే నెరపేవు పైకొనుచు నీవు
(॥ఎంత॥)
కడఁగి పాన్పుపై నన్ను గాఁగిలించుకొనెనంటా
యెడచొచ్చి కూడేవు యేమే నీవు
అడరి శ్రీవేంకటేశుఁడాతఁడు నీవాఁడంటా
బడివాయక వుండేవు పచ్చిదేర నీవు
(||pallavi||)
ĕṁta balimigattĕvu yeme nīvu
maṁtanamāḍaguṁḍānu mānibevā nīvu
(||ĕṁta||)
kāmiṁchi yādam̐ḍu nāsaṁgaḍi gūsuṁḍĕnaṁṭānu
yememi māḍalāḍeve yiṁtalo nīvu
nī magam̐ḍe nāsedigi nimmabaṁḍichchĕnaṁṭānu
gāmiḍisem̐ta sesevu kānīve nīvu
(||ĕṁta||)
iṁtalo nādam̐ḍu mā iṁṭigi vachchĕnaṁṭānu
yĕṁtesi navvulu navve veme nīvu
dŏṁtaravalabudo nā tŏḍabaim̐ baṁḍunnām̐ḍaṁṭā
paṁtamule nĕrabevu paigŏnusu nīvu
(||ĕṁta||)
kaḍam̐gi pānpubai nannu gām̐giliṁchugŏnĕnaṁṭā
yĕḍasŏchchi kūḍevu yeme nīvu
aḍari śhrīveṁkaḍeśhum̐ḍādam̐ḍu nīvām̐ḍaṁṭā
baḍivāyaga vuṁḍevu pachchidera nīvu