Emta aasodagaamdavu yemi seppedi

ఎంత ఆసోదకాఁడవు యేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత ఆసోదకాఁడవు యేమి చెప్పేది
బంతిఁబెట్టి తమకమే పచారించేవు

(॥ఎంత॥)
చెంగలించి యాపె నీపై సేసపాలు చల్లఁగాను
యెంగిలి నామోవికి యేల లాచేవు
ముంగురు లంటి యప్పటి మొల్లలు ముడువఁగాను
సింగారించేనంటా నాపై చెయ్యేమి చాఁచేవు

(॥ఎంత॥)
కూరిమి గొసరి తాను కొంగవట్టి తియ్యఁగాను
యేరా నా చన్నులకు నీవే కోరేవు
గారవించి చెక్కు నొక్కి కమ్మటి వేఁడుకోఁగాను
నారుకాన నాతోను నవ్వులు నవ్వేవు

(॥ఎంత॥)
వొద్దిక నలమేల్ మంగ వురమెక్కుకుండఁగాను
పెద్దరికమున నన్నుఁ బెండ్లాడేవు
సుద్దులు చెప్పుతా మరి చూపుల నిన్నుఁ జూడఁగా
అద్దుక శ్రీవేంకటేశ యట్టె నన్ను నేలేవు

(||pallavi||)
ĕṁta āsodagām̐ḍavu yemi sĕppedi
baṁtim̐bĕṭṭi tamagame pasāriṁchevu

(||ĕṁta||)
sĕṁgaliṁchi yābĕ nībai sesabālu sallam̐gānu
yĕṁgili nāmovigi yela lāsevu
muṁguru laṁṭi yappaḍi mŏllalu muḍuvam̐gānu
siṁgāriṁchenaṁṭā nābai sĕyyemi sām̐sevu

(||ĕṁta||)
kūrimi gŏsari tānu kŏṁgavaṭṭi tiyyam̐gānu
yerā nā sannulagu nīve korevu
gāraviṁchi sĕkku nŏkki kammaḍi vem̐ḍugom̐gānu
nārugāna nādonu navvulu navvevu

(||ĕṁta||)
vŏddiga nalamel maṁga vuramĕkkuguṁḍam̐gānu
pĕddarigamuna nannum̐ bĕṁḍlāḍevu
suddulu sĕppudā mari sūbula ninnum̐ jūḍam̐gā
adduga śhrīveṁkaḍeśha yaṭṭĕ nannu nelevu