Emmelu seyamgabode ninniyu bayadam bade

ఎమ్మెలు సేయఁగబోతే నిన్నియు బయటఁ బడె
Language

(॥పల్లవి॥)
ఎమ్మెలు సేయఁగబోతే నిన్నియు బయటఁ బడె
కొమ్మలెల్లా నిందులకే గోరాదిగొనేరు

(॥ఎమ్మె॥)
వేడుకకు నవ్వఁబోతే వెన్నులలు వెళ్లీఁజుమ్మీ
తోడనే రేపల్లెవారు తొంగిచూచేరు
ఆడ రాగాలు సేసితే నావులు వచ్చీఁజుమ్మీ
మేడెపు బ్రహ్మాదులెల్లా మింట నున్నారు

(॥ఎమ్మె॥)
చిత్తగించి చూచితేనే సిగ్గులు రేఁగీఁజుమ్మీ
మొత్తమై గొపికలెల్ల మొక్కుచున్నారు
మత్తిలి మెయి సోఁకనికు మాకులు విరిగిపడీ
వొత్తినకంసాడులెల్ల నుప్పతించేరు

(॥ఎమ్యె॥)
పాదమునఁ జిమ్మఁ బొతే బండ్లు బండుబండయ్యీ
వీదుల వీదులవారు వెరగంచెరు
ఆదిగోని శ్రీవేంకటాద్రివిఠలుఁడ నన్ను
యీదెసఁ గూడితివి మాయింటివా రాడేరు

(||pallavi||)
ĕmmĕlu seyam̐gabode ninniyu bayaḍam̐ baḍĕ
kŏmmalĕllā niṁdulage gorādigŏneru

(||ĕmmĕ||)
veḍugagu navvam̐bode vĕnnulalu vĕḽlīm̐jummī
toḍane reballĕvāru tŏṁgisūseru
āḍa rāgālu seside nāvulu vachchīm̐jummī
meḍĕbu brahmādulĕllā miṁṭa nunnāru

(||ĕmmĕ||)
sittagiṁchi sūsidene siggulu rem̐gīm̐jummī
mŏttamai gŏbigalĕlla mŏkkusunnāru
mattili mĕyi som̐kanigu māgulu virigibaḍī
vŏttinagaṁsāḍulĕlla nuppadiṁcheru

(||ĕmyĕ||)
pādamunam̐ jimmam̐ bŏde baṁḍlu baṁḍubaṁḍayyī
vīdula vīdulavāru vĕragaṁchĕru
ādigoni śhrīveṁkaḍādriviṭhalum̐ḍa nannu
yīdĕsam̐ gūḍidivi māyiṁṭivā rāḍeru