ఎమ్మెలవాఁడవు నీతో నెదురాడవచ్చునా
(॥పల్లవి॥)
ఎమ్మెలవాఁడవు నీతో నెదురాడవచ్చునా
సమ్మతించి బొమ్మలనే జంకించుటగాక
(॥ఎమ్మె॥)
కోపగించవచ్చునాకొచ్చి నిన్నుసారెసారె
చూపులునాఁటించి సాదించుటగాక
రాపుసేయవచ్చునా రావనుచు నింతలోనె
తీపులమోవివలువ తీసుటగాక
(॥ఎమ్మె॥)
అలఇంచవచ్చునా అట్టునిట్టుఁ దీసినిన్ను
వొలిసి నాచనుగుబ్బల నొత్తుటగాక
బలిమిచూపవచ్చునా పైకొని సరసమాడి
కళలురేఁచివేడుక కైకొంటగాక
(॥ఎమ్మె॥)
వేసరించవచ్చునా వేగినంతా రతులను
ఆస చూపి నిన్ను మర్మాలంటుటగాక
సేసతో శ్రీవేంకటేశ చెందితి వాఁపవచ్చునా
లాసి నీకరుణెల్లా లాగించుటగాక
(||pallavi||)
ĕmmĕlavām̐ḍavu nīdo nĕdurāḍavachchunā
sammadiṁchi bŏmmalane jaṁkiṁchuḍagāga
(||ĕmmĕ||)
kobagiṁchavachchunāgŏchchi ninnusārĕsārĕ
sūbulunām̐ṭiṁchi sādiṁchuḍagāga
rābuseyavachchunā rāvanusu niṁtalonĕ
tībulamovivaluva tīsuḍagāga
(||ĕmmĕ||)
ala̮iṁchavachchunā aṭṭuniṭṭum̐ dīsininnu
vŏlisi nāsanugubbala nŏttuḍagāga
balimisūbavachchunā paigŏni sarasamāḍi
kaḽalurem̐siveḍuga kaigŏṁṭagāga
(||ĕmmĕ||)
vesariṁchavachchunā veginaṁtā radulanu
āsa sūbi ninnu marmālaṁṭuḍagāga
sesado śhrīveṁkaḍeśha sĕṁdidi vām̐pavachchunā
lāsi nīgaruṇĕllā lāgiṁchuḍagāga