Emisesee nimtilone yeppudu vachcheem daanu

ఏమిసేసీ నింటిలోనె యెప్పుడు వచ్చీఁ దాను
Language

(॥పల్లవి॥)
ఏమిసేసీ నింటిలోనె యెప్పుడు వచ్చీఁ దాను
ప్రేమతో నున్నాఁడ నేను పిలువరే మీరు

(॥ఏమి॥)
మొనసి చెలియ నాముందర నిలిచినట్టు
పెనఁగి కాఁగిటిలోన బెరసినట్టు
తనివార మోవియిచ్చి దప్పిదేరిచినయట్టు
మనసున మెలఁగీని మాటలాడినట్టు

(॥ఏమి॥)
చెలరేఁగి నాయొద్ద సెలవుల నగినట్టు
సొలయుచు నాదిక్కు చూచినయట్టు
నలిగె మెరసి నాతో సరసమాడినయట్టు
కలలోనఁ బొరసీని కప్పురమిచ్చినట్టు

(॥ఏమి॥)
చెక్కునొక్కి నామీఁద సేసలు చల్లినట్టు
గక్కనఁ బయ్యద నాపైఁ గప్పినయట్లు
యిక్కడ నే శ్రీవేంకటేశుఁడ దానే వచ్చి
నిక్కముగా నన్నుఁ గూడె నిండీ నింకా నాసలు

(||pallavi||)
emisesī niṁṭilonĕ yĕppuḍu vachchīm̐ dānu
premado nunnām̐ḍa nenu piluvare mīru

(||emi||)
mŏnasi sĕliya nāmuṁdara nilisinaṭṭu
pĕnam̐gi kām̐giḍilona bĕrasinaṭṭu
tanivāra moviyichchi dappiderisinayaṭṭu
manasuna mĕlam̐gīni māḍalāḍinaṭṭu

(||emi||)
sĕlarem̐gi nāyŏdda sĕlavula naginaṭṭu
sŏlayusu nādikku sūsinayaṭṭu
naligĕ mĕrasi nādo sarasamāḍinayaṭṭu
kalalonam̐ bŏrasīni kappuramichchinaṭṭu

(||emi||)
sĕkkunŏkki nāmīm̐da sesalu sallinaṭṭu
gakkanam̐ bayyada nābaim̐ gappinayaṭlu
yikkaḍa ne śhrīveṁkaḍeśhum̐ḍa dāne vachchi
nikkamugā nannum̐ gūḍĕ niṁḍī niṁkā nāsalu