Emidigi nappadini velayimcheeni

ఏమిటికి నప్పటిని వెలయించీని
Language

(॥పల్లవి॥)
ఏమిటికి నప్పటిని వెలయించీని
కామించి యన్నియు నేనే కనుగొంటినే

(॥ఏమి॥)
సిగ్గువడ నేర్చునట సెలవి నవ్వనేరఁడా
అగ్గమై తనకు నన్ని యమరినవే
వెగ్గళించ నిఁకనేలే వేడుకకాఁడన్నిటాను
యెగ్గులెంచ తనలాగు లెఱుఁగుదునే

(॥ఏమి॥)
మాటలాడనోపునట మచ్చిక చూపనోపఁడా
బూటకాలన్నీఁ దనకు పొసఁగినవే
చాటిచెప్ప మరియేలే జాణఁడు యీపనులకు
యీటులేని తనసుద్దు లియ్యకొంటినే

(॥ఏమి॥)
సేస చల్లఁగలఁడట చెలఁగి కూడఁగలేఁడా
దోసములే దన్నియును దొరసినవే
వేసరనేలే తానే శ్రీ వేంకటేశుఁ డేలే నన్ను
పోసరించి రతులనుఁ బొసఁగింతునే

(||pallavi||)
emiḍigi nappaḍini vĕlayiṁchīni
kāmiṁchi yanniyu nene kanugŏṁṭine

(||emi||)
sigguvaḍa nersunaḍa sĕlavi navvaneram̐ḍā
aggamai tanagu nanni yamarinave
vĕggaḽiṁcha nim̐kanele veḍugagām̐ḍanniḍānu
yĕggulĕṁcha tanalāgu lĕṟum̐gudune

(||emi||)
māḍalāḍanobunaḍa machchiga sūbanobam̐ḍā
būḍagālannīm̐ danagu pŏsam̐ginave
sāḍisĕppa mariyele jāṇam̐ḍu yībanulagu
yīḍuleni tanasuddu liyyagŏṁṭine

(||emi||)
sesa sallam̐galam̐ḍaḍa sĕlam̐gi kūḍam̐galem̐ḍā
dosamule danniyunu dŏrasinave
vesaranele tāne śhrī veṁkaḍeśhum̐ ḍele nannu
posariṁchi radulanum̐ bŏsam̐giṁtune