Emidigi bigisevu imdarum joodamgaanu

ఏమిటికి బిగిసేవు ఇందరుఁ జూడఁగాను
Language

(॥పల్లవి॥)
ఏమిటికి బిగిసేవు ఇందరుఁ జూడఁగాను
ప్రేమ వుట్టించి యాతనిఁ బిలిచి తేఁగదవే

(॥ఏమి॥)
పెలుచవై వంతులకుఁ బెనఁగేవు రమణుని
వలపించుకొంటివా నావలెనే నీవు
పొలిఁతివై పుట్టితేనే భోగములు సరియౌనా
సొలసి నేర్పులఁ జవిచూపవలెఁగాక

(॥ఏమి॥)
వడిగా నాసంగడికి వచ్చేవు నాయకుని
కడుఁ బనిగొంటివా నాకైవడి నీవు
నడుమ సవతివైతే నావోజ నీకు వచ్చీనా
పెడఁబాయ కాతని మెప్పించవలెఁగాక

(॥ఏమి॥)
పుక్కట సేసలు చల్లి పొత్తుగలసే వాతని
దక్కఁగొంటివా నాచందమున నీవు
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డిటు న న్నాతఁడె యేలె
నిక్కమైతే నీవు నిట్టే నేరవలెఁగాక

(||pallavi||)
emiḍigi bigisevu iṁdarum̐ jūḍam̐gānu
prema vuṭṭiṁchi yādanim̐ bilisi tem̐gadave

(||emi||)
pĕlusavai vaṁtulagum̐ bĕnam̐gevu ramaṇuni
valabiṁchugŏṁṭivā nāvalĕne nīvu
pŏlim̐tivai puṭṭidene bhogamulu sariyaunā
sŏlasi nerbulam̐ javisūbavalĕm̐gāga

(||emi||)
vaḍigā nāsaṁgaḍigi vachchevu nāyaguni
kaḍum̐ banigŏṁṭivā nāgaivaḍi nīvu
naḍuma savadivaide nāvoja nīgu vachchīnā
pĕḍam̐bāya kādani mĕppiṁchavalĕm̐gāga

(||emi||)
pukkaḍa sesalu salli pŏttugalase vādani
dakkam̐gŏṁṭivā nāsaṁdamuna nīvu
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiḍu na nnādam̐ḍĕ yelĕ
nikkamaide nīvu niṭṭe neravalĕm̐gāga