Emidaa sanna yeṟamgaveme neevu

ఏమిటా సన్న యెఱఁగవేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఏమిటా సన్న యెఱఁగవేమే నీవు
కామించె నిన్ను నతఁడు కదియవే నీవు

(॥ఏమి॥)
యేకతాన నున్న వాఁడు యెదురుచూచీ నీకు
ఆకడ నాతనితో మాటాడవే నీవు
మేకొని నిద్రలేచె మెరసి నీవంక చూచె
ఆకులు వక్కలు జేతి కందియ్యవే నీవు

(॥ఏమి॥)
పిలిచినాఁడు నిన్ను ప్రియముచెప్పీ నీకు
యెలమితో దోమతెర యెత్తవే నీవు
బలిమిఁ బాదాలు చాఁచెపంతములెల్లా రేఁచె
సులభాన నొల్లనే పిలసుకవే నీవు

(॥ఏమి॥)
మనసుపెట్టినాఁడు మరిగివున్నాఁడు నీకు
ననుపుచేసుక కొంత నవ్వవే నీవు
చెనకి సరసమాడె శ్రీవేంకటేశుఁడు గూడె
వొనరి యేపొద్దూఁ బాయకుండవే నీవు

(||pallavi||)
emiḍā sanna yĕṟam̐gaveme nīvu
kāmiṁchĕ ninnu nadam̐ḍu kadiyave nīvu

(||emi||)
yegadāna nunna vām̐ḍu yĕdurusūsī nīgu
āgaḍa nādanido māḍāḍave nīvu
megŏni nidralesĕ mĕrasi nīvaṁka sūsĕ
āgulu vakkalu jedi kaṁdiyyave nīvu

(||emi||)
pilisinām̐ḍu ninnu priyamusĕppī nīgu
yĕlamido domadĕra yĕttave nīvu
balimim̐ bādālu sām̐sĕbaṁtamulĕllā rem̐sĕ
sulabhāna nŏllane pilasugave nīvu

(||emi||)
manasubĕṭṭinām̐ḍu marigivunnām̐ḍu nīgu
nanubusesuga kŏṁta navvave nīvu
sĕnagi sarasamāḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ
vŏnari yebŏddūm̐ bāyaguṁḍave nīvu