Emi seyavachchunayya yillaamdla kiviyela

ఏమి సేయవచ్చునయ్య యిల్లాండ్ల కివియేల
Language

(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చునయ్య యిల్లాండ్ల కివియేల
వేమారు నిటువంటివే వేడుకాయ నీకును

(॥ఏమి॥)
కెలయుచు నింతి నీతో కిమ్ముల సారె నాడేటి
పెలుచుమాటలు నీకుఁ బ్రియమాయను
బలిమి బెనఁగి నీతోఁబై కొన్న సరసముల
చలపాదితనములు చవులాయను

(॥ఏమి॥)
కేరుచు నాపె నేఁడు కెలన నవ్వులు నవ్వె
అరజములే నీకు ననువాయను
చేరి చేరి యప్పటిని చేతిమీఁదఁ జేయివేసి
బీరపుపందెములే ప్రియమాయను

(॥ఏమి॥)
కందువఁ గాఁగిటఁ గూడి కమ్మటి నాకెకు నీకు
సందడిఁ బచ్చిసేఁతలే సాజమాయను
ఇందరిలో శ్రీ వేంకటేశ నన్ను నేలితివి
విందులు మోవితేనెలు వీదుదోళ్లాయను

(||pallavi||)
emi seyavachchunayya yillāṁḍla kiviyela
vemāru niḍuvaṁṭive veḍugāya nīgunu

(||emi||)
kĕlayusu niṁti nīdo kimmula sārĕ nāḍeḍi
pĕlusumāḍalu nīgum̐ briyamāyanu
balimi bĕnam̐gi nīdom̐bai kŏnna sarasamula
salabādidanamulu savulāyanu

(||emi||)
kerusu nābĕ nem̐ḍu kĕlana navvulu navvĕ
arajamule nīgu nanuvāyanu
seri seri yappaḍini sedimīm̐dam̐ jeyivesi
bīrabubaṁdĕmule priyamāyanu

(||emi||)
kaṁduvam̐ gām̐giḍam̐ gūḍi kammaḍi nāgĕgu nīgu
saṁdaḍim̐ bachchisem̐tale sājamāyanu
iṁdarilo śhrī veṁkaḍeśha nannu nelidivi
viṁdulu movidenĕlu vīdudoḽlāyanu