ఏమి సేయవచ్చు నిఁక యిట్టుండెను నీ పుణ్యము
(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చు నిఁక యిట్టుండెను నీ పుణ్యము
కామినుల భోగ మెంత కాఁగలదో నీకు
(॥ఏమి॥)
మంచివాఁడవె నీవు మంకువనితెను నేను
యెంచి మాతోఁ గూడి నీవు యెడ్డవైతివి
కంచము పొత్తున నేల కదిసి యారగించేవు
ఇంచుకంత యెంగి లంటి ఇఁక నెంత యౌదువో
(॥ఏమి॥)
తగవరివే నీవు తమకపుదాన నాతో
తగులఁగా నీవింత తక్కరివైతి
పగటున నేఁ బండేపానుపుపైఁ బండేవు
యెగువ దిగువలను యిఁక నెంత యౌదువో
(॥ఏమి॥)
అట్టె శ్రీ వేంకటేశుఁడ వలమేలుమంగ నేను
తొట్టి వురమెక్కించుక దొరవైతివి
బట్టిగొని అప్పటిని సరసములాడేవు
యిట్టె నీ జాణతనాల యిఁక నెంత యవుదువో
(||pallavi||)
emi seyavachchu nim̐ka yiṭṭuṁḍĕnu nī puṇyamu
kāminula bhoga mĕṁta kām̐galado nīgu
(||emi||)
maṁchivām̐ḍavĕ nīvu maṁkuvanidĕnu nenu
yĕṁchi mādom̐ gūḍi nīvu yĕḍḍavaidivi
kaṁchamu pŏttuna nela kadisi yāragiṁchevu
iṁchugaṁta yĕṁgi laṁṭi im̐ka nĕṁta yauduvo
(||emi||)
tagavarive nīvu tamagabudāna nādo
tagulam̐gā nīviṁta takkarivaidi
pagaḍuna nem̐ baṁḍebānububaim̐ baṁḍevu
yĕguva diguvalanu yim̐ka nĕṁta yauduvo
(||emi||)
aṭṭĕ śhrī veṁkaḍeśhum̐ḍa valamelumaṁga nenu
tŏṭṭi vuramĕkkiṁchuga dŏravaidivi
baṭṭigŏni appaḍini sarasamulāḍevu
yiṭṭĕ nī jāṇadanāla yim̐ka nĕṁta yavuduvo