Emi seyavachchu neeve yimdarigi guraidivi

ఏమి సేయవచ్చు నీవే యిందరికి గురైతివి
Language

(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చు నీవే యిందరికి గురైతివి
కామించినవారికి మగఁడవు గావయ్యా

(॥ఏమి॥)
తడవుగాఁ జూచేయట్టితరుణులచూపులకు
యెడయక నీరూపము యెంగిలాయను
కడుగుకొంటేఁ బోదు కాంక్షలలోపలిజిడ్డు
వడిగా వారిచన్నులఁ దుడుచుకోవయ్యా

(॥ఏమి॥)
తలపోసేకంతలచిత్తములకు నీవయసు
కలగం పై పడిగముగతి యాయను
వెలఁచితేఁ బోదు మరి వేడుకలు మెఱుఁగెక్కు
చెలఁగి వారిమోవులఁ జికిలిసేయవయ్యా

(॥ఏమి॥)
దోమటినీదేవుళ్ళకందువలకాఁగిళ్లకు
ప్రేమ నీవురము పెండ్లిపీఁటాయను
ఆమని శ్రీవేంకటేశ అంటు వోదు పొరలితే
వామిగా నన్నుఁగూడితి వారిఁ బిలువవయ్యా

(||pallavi||)
emi seyavachchu nīve yiṁdarigi guraidivi
kāmiṁchinavārigi magam̐ḍavu gāvayyā

(||emi||)
taḍavugām̐ jūseyaṭṭidaruṇulasūbulagu
yĕḍayaga nīrūbamu yĕṁgilāyanu
kaḍugugŏṁṭem̐ bodu kāṁkṣhalalobalijiḍḍu
vaḍigā vārisannulam̐ duḍusugovayyā

(||emi||)
talabosegaṁtalasittamulagu nīvayasu
kalagaṁ pai paḍigamugadi yāyanu
vĕlam̐sidem̐ bodu mari veḍugalu mĕṟum̐gĕkku
sĕlam̐gi vārimovulam̐ jigiliseyavayyā

(||emi||)
domaḍinīdevuḽḽagaṁduvalagām̐giḽlagu
prema nīvuramu pĕṁḍlibīm̐ṭāyanu
āmani śhrīveṁkaḍeśha aṁṭu vodu pŏralide
vāmigā nannum̐gūḍidi vārim̐ biluvavayyā