Emi seyavachchu namdugemi simtimchagu

ఏమి సేయవచ్చు నందుకేమి చింతించకు
Language

(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చు నందుకేమి చింతించకు
సాముల నాతోడి పొందు చక్కదిద్దీఁ బనులు

(॥ఏమి॥)
వేగిలే చెవ్వతెమో వెసఁ జూచి వచ్చితివో
చేగదేర నాగోరు నీచెక్కు దాఁకెను
వాగమై యెవ్వతె నీకు వచ్చినవేళ గుణమో
ఆగడపు మాటలకు నటు గురియైతివి

(॥ఏమి॥)
యెక్కడ నెవ్వతె మోవియెంగి లంటిన దోసమో
నిక్కి నాపలుసోఁకులు నీసందులంటె
కక్కసాన నెవ్వతెను కాఁగిలించి వచ్చిన ఫలమో
తొక్కుల నీమేను నాచేతోదోపులఁ జిక్కెను

(॥ఏమి॥)
తొరవి యెవ్వతెకాలు దొక్కిన భాగ్యమహిమో
వొరసి నా చన్నులు నీవురము నాఁటె
ఇరవై శ్రీ వేంకటేశ యెవ్వతెమేలు వంకనో
పరగ నా ఇంటఁ గూడి పాయక నీవుంటివి

(||pallavi||)
emi seyavachchu naṁdugemi siṁtiṁchagu
sāmula nādoḍi pŏṁdu sakkadiddīm̐ banulu

(||emi||)
vegile sĕvvadĕmo vĕsam̐ jūsi vachchidivo
segadera nāgoru nīsĕkku dām̐kĕnu
vāgamai yĕvvadĕ nīgu vachchinaveḽa guṇamo
āgaḍabu māḍalagu naḍu guriyaidivi

(||emi||)
yĕkkaḍa nĕvvadĕ moviyĕṁgi laṁṭina dosamo
nikki nābalusom̐kulu nīsaṁdulaṁṭĕ
kakkasāna nĕvvadĕnu kām̐giliṁchi vachchina phalamo
tŏkkula nīmenu nāsedodobulam̐ jikkĕnu

(||emi||)
tŏravi yĕvvadĕgālu dŏkkina bhāgyamahimo
vŏrasi nā sannulu nīvuramu nām̐ṭĕ
iravai śhrī veṁkaḍeśha yĕvvadĕmelu vaṁkano
paraga nā iṁṭam̐ gūḍi pāyaga nīvuṁṭivi