ఏమి సేసు నాతఁడు యెందరికని వోవును
(॥పల్లవి॥)
ఏమి సేసు నాతఁడు యెందరికని వోవును
నేమములు నేర్పకురే నెలఁతలాల
(॥ఏమి॥)
అక్కడనుండి వచ్చి ఆ పరాకై వున్నాఁడేమో
కక్కసించకురే వో కాంతలాల
నెక్కొని యలసి వచ్చి నిద్దురతో నున్నాడేమో
పక్కన లేపకురే పడఁతులాల
(॥ఏమి॥)
వలపు చపుల సోఁకి వడిఁ జొక్కివున్నాఁడేమో
బలిమిసేయకురే భామలాల
యెలమి నాపెకు బాస ఇచ్చి వచ్చినాఁడేమో
చలము సాదింకురే జలజాక్షులాల
(॥ఏమి॥)
తగిలి వారిరూపులు తలఁచుకొనీనో యేమో
అగడుసేయకురే యంగనలాల
జిగి శ్రీవేంకటేశుఁడు సింగారవనములోన
నగి కూడెఁ గోనేటిలో నన్ను నింతులాల
(||pallavi||)
emi sesu nādam̐ḍu yĕṁdarigani vovunu
nemamulu nerbagure nĕlam̐talāla
(||emi||)
akkaḍanuṁḍi vachchi ā parāgai vunnām̐ḍemo
kakkasiṁchagure vo kāṁtalāla
nĕkkŏni yalasi vachchi niddurado nunnāḍemo
pakkana lebagure paḍam̐tulāla
(||emi||)
valabu sabula som̐ki vaḍim̐ jŏkkivunnām̐ḍemo
balimiseyagure bhāmalāla
yĕlami nābĕgu bāsa ichchi vachchinām̐ḍemo
salamu sādiṁkure jalajākṣhulāla
(||emi||)
tagili vārirūbulu talam̐sugŏnīno yemo
agaḍuseyagure yaṁganalāla
jigi śhrīveṁkaḍeśhum̐ḍu siṁgāravanamulona
nagi kūḍĕm̐ goneḍilo nannu niṁtulāla