Emi sesinaa neeyichchagolamde kaaga

ఏమి సేసినా నీయిచ్చకొలఁదే కాక
Language

(॥పల్లవి॥)
ఏమి సేసినా నీయిచ్చకొలఁదే కాక
కామినులము నిన్నెట్లు కాదనఁగవచ్చును

(॥ఏమి॥)
తళుకునఁ బొలసేవు తలయెత్తి చూచేవు
చలపట్టితే వలపు చప్పరించేవు
చెలి దగ్గరివచ్చితే చేతి లోనయ్యేవు
బలిమి నీమనసెట్టు పట్టేమనవచ్చును

(॥ఏమి॥)
కడుఁబెచ్చుపెరిగేవు గక్కన సూడువట్టేవు
విడువలేక సతిని వెంటఁ దిప్పేవు
వొడివట్టి తీసేవు వూరివారి నెల్లాను
చిడుముడి నిన్ను నెట్టు చెనకఁగవచ్చును

(॥ఏమి॥)
కమ్మి సిగ్గువడవు తొక్కనిచోట్లు తొక్కేవు
పమ్మి యలమేల్మంగకుఁ బతివి నీవు
చిమ్ముచు మేకులకే శ్రీవేంకటేశ మొక్కితి
నెమ్మది నిన్నిఁక నెట్టు నేరమెంచవచ్చును

(||pallavi||)
emi sesinā nīyichchagŏlam̐de kāga
kāminulamu ninnĕṭlu kādanam̐gavachchunu

(||emi||)
taḽugunam̐ bŏlasevu talayĕtti sūsevu
salabaṭṭide valabu sappariṁchevu
sĕli daggarivachchide sedi lonayyevu
balimi nīmanasĕṭṭu paṭṭemanavachchunu

(||emi||)
kaḍum̐bĕchchubĕrigevu gakkana sūḍuvaṭṭevu
viḍuvalega sadini vĕṁṭam̐ dippevu
vŏḍivaṭṭi tīsevu vūrivāri nĕllānu
siḍumuḍi ninnu nĕṭṭu sĕnagam̐gavachchunu

(||emi||)
kammi sigguvaḍavu tŏkkanisoṭlu tŏkkevu
pammi yalamelmaṁgagum̐ badivi nīvu
simmusu megulage śhrīveṁkaḍeśha mŏkkidi
nĕmmadi ninnim̐ka nĕṭṭu neramĕṁchavachchunu