Emi seseene vibhumdu yippu ditte raavaddaa

ఏమి సేసీనే విభుఁడు యిప్పు డిట్టె రావద్దా
Language

(॥పల్లవి॥)
ఏమి సేసీనే విభుఁడు యిప్పు డిట్టె రావద్దా
చూ మరల నే నెదురుచూచుకొంటా నుందాన

(॥ఏమి॥)
మనసులోనున్నవాఁడు మాటలాడవద్దా తాను
తనివొక యేపోద్దూఁ దలఁచే నేనే
కనుఁగొన్నట్టయ్యీ దండ గక్కనఁ గూచుండవద్దా
పనివూని తనుకుఁగా భ్రమసివుందానను

(॥ఏమి॥)
కలలోవచ్చినవాఁడు కాఁగిలించుకొనవద్దా
తలిరుఁబానువుపై నుందానను నేను
యెలుఁగు విన్నట్టయ్యీవి ఇట్టె వూఁకొనవద్దా
బెళకక పేరుకొని పిలిచే నేను

(॥ఏమి॥)
చిత్తరువులోనివాఁడు సేస పైఁ జల్లఁగవద్దా
మత్తిలి, నే నలమేలుమంగఁ దనకు
యిత్తల శ్రీవేంకటేశుఁ డింతలోఁ దా వచ్చికూడె
కొత్తగా మన్నించవద్దా కోసరే నేను

(||pallavi||)
emi sesīne vibhum̐ḍu yippu ḍiṭṭĕ rāvaddā
sū marala ne nĕdurusūsugŏṁṭā nuṁdāna

(||emi||)
manasulonunnavām̐ḍu māḍalāḍavaddā tānu
tanivŏga yeboddūm̐ dalam̐se nene
kanum̐gŏnnaṭṭayyī daṁḍa gakkanam̐ gūsuṁḍavaddā
panivūni tanugum̐gā bhramasivuṁdānanu

(||emi||)
kalalovachchinavām̐ḍu kām̐giliṁchugŏnavaddā
talirum̐bānuvubai nuṁdānanu nenu
yĕlum̐gu vinnaṭṭayyīvi iṭṭĕ vūm̐kŏnavaddā
bĕḽagaka perugŏni pilise nenu

(||emi||)
sittaruvulonivām̐ḍu sesa paim̐ jallam̐gavaddā
mattili, ne nalamelumaṁgam̐ danagu
yittala śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalom̐ dā vachchigūḍĕ
kŏttagā manniṁchavaddā kosare nenu