Emi seppugoneve yimtulado nee yemmelu

ఏమి చెప్పుకొనేవే యింతులతో నీ యెమ్మెలు
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పుకొనేవే యింతులతో నీ యెమ్మెలు
వేమరు నీ గుట్టు వెల్లవిరిసేయ నేఁటికే

(॥ఏమి॥)
కలికితనాల నీవు కాఁపురాలు సేయఁగాను
వలవ కెట్టుండునే రవ్వగా మగఁడు
చలిమి బలిమితోడ జాణతనా లాడఁగాను
సులబాన నీ కతఁడు చొక్కవలెఁగదవే

(॥ఏమి॥)
యెన్నికతో నేపొద్దూ యెదుటఁ గాచుకుండఁగాను
మన్నించ కెట్టుండునే మరి యాతఁడు
సన్నలనే మోవి తేనె చవులెల్లాఁ జూపఁగాను
మిన్నక నీ చేఁతలకు మెచ్చవలెఁగదవే

(॥ఏమి॥)
కమ్మి సింగారించుకొని కాఁగిటఁ బెనఁగఁగాను
సమ్మతించ కెట్టుండునే సరుగదాను
యిమ్ముల శ్రీవేంకటేశుఁ డితఁ డిట్టె నన్ను నేలె
నమ్మించి నీ కతలకు నవ్వవలెఁగదవే

(||pallavi||)
emi sĕppugŏneve yiṁtulado nī yĕmmĕlu
vemaru nī guṭṭu vĕllaviriseya nem̐ṭige

(||emi||)
kaligidanāla nīvu kām̐purālu seyam̐gānu
valava kĕṭṭuṁḍune ravvagā magam̐ḍu
salimi balimidoḍa jāṇadanā lāḍam̐gānu
sulabāna nī kadam̐ḍu sŏkkavalĕm̐gadave

(||emi||)
yĕnnigado nebŏddū yĕduḍam̐ gāsuguṁḍam̐gānu
manniṁcha kĕṭṭuṁḍune mari yādam̐ḍu
sannalane movi tenĕ savulĕllām̐ jūbam̐gānu
minnaga nī sem̐talagu mĕchchavalĕm̐gadave

(||emi||)
kammi siṁgāriṁchugŏni kām̐giḍam̐ bĕnam̐gam̐gānu
sammadiṁcha kĕṭṭuṁḍune sarugadānu
yimmula śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ ḍiṭṭĕ nannu nelĕ
nammiṁchi nī kadalagu navvavalĕm̐gadave