Emi seppinaam jesenu yeggaa naagu

ఏమి చెప్పినాఁ జేసేను యెగ్గా నాకు
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పినాఁ జేసేను యెగ్గా నాకు
వేమారు నెంతచేసినా వెంగెమా నాకు

(॥ఏమి॥)
చేరి నన్ను వేఁడుకొని చెక్కు నొక్కరాఁగాను
సారెసారెఁ బెనఁగఁగ చలమా నాకు
గారవించి నీవు నన్నుఁ గతలు చెప్పుమనఁగా
వూరకే వుండఁగ నీతో వొరటా నాకు

(॥ఏమి॥)
అగపడి మంచిమాట లాడఁగానే వేగిరించి
యెగసక్కేలాడ నీతో యెమ్మెలా నాకు
నగుతా నీవు నన్ను నమ్మించి బాస లియ్యంగా
పగటులు పచరించ పంతమా నాకు

(॥ఏమి॥)
పోదిసేసి విడెమిచ్చి పొందు నీవు నడపఁగా
కాదు గూడదన నీతో గర్వమా నాకు
యీదెస శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
సాదించ నీతోడ రాజసమా నాకు

(||pallavi||)
emi sĕppinām̐ jesenu yĕggā nāgu
vemāru nĕṁtasesinā vĕṁgĕmā nāgu

(||emi||)
seri nannu vem̐ḍugŏni sĕkku nŏkkarām̐gānu
sārĕsārĕm̐ bĕnam̐gam̐ga salamā nāgu
gāraviṁchi nīvu nannum̐ gadalu sĕppumanam̐gā
vūrage vuṁḍam̐ga nīdo vŏraḍā nāgu

(||emi||)
agabaḍi maṁchimāḍa lāḍam̐gāne vegiriṁchi
yĕgasakkelāḍa nīdo yĕmmĕlā nāgu
nagudā nīvu nannu nammiṁchi bāsa liyyaṁgā
pagaḍulu pasariṁcha paṁtamā nāgu

(||emi||)
podisesi viḍĕmichchi pŏṁdu nīvu naḍabam̐gā
kādu gūḍadana nīdo garvamā nāgu
yīdĕsa śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
sādiṁcha nīdoḍa rājasamā nāgu