Emi seppinaam jese yeggu lemcha nimka ninnu

ఏమి చెప్పినాఁ జేసే యెగ్గు లెంచ నిఁక నిన్ను
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పినాఁ జేసే యెగ్గు లెంచ నిఁక నిన్ను
గోమున నీవు గోరిన కోరిక లీడేరెను

(॥ఏమి॥)
వింటిఁగా నీ సుద్దులెల్లా వీనుల పండువగాను
సొంటులు సోదించి నిన్ను సొలయనేల
కంటిఁగా నీ చేఁతలు కన్నుల పండువగాను
అంటి ముట్టి నిన్ను బాస లడుగనేలా

(॥ఏమి॥)
నమ్మితిఁగా నీ గుణాలు నవ్వుల పండువగాను
సమ్మతించ కిఁక నిన్ను జరయనేల
దొమ్మిఁ గాలు దొక్కితిఁగా దోమటి పండుగగాను
చిమ్ముచుఁ గొనగోళ్లఁ జెనకనేలా

(॥ఏమి॥)
సేసుకొంటిఁగా నిన్నుఁ జేరి నిచ్చ పండుగగా
వేసాలకు నింకాను వేఁడుకోనేల
వాసితో న న్నేలితివి వచ్చి శ్రీవేంకటేశుఁడ
ఆసల నిన్ని పండుగ లాడుకొనేలా

(||pallavi||)
emi sĕppinām̐ jese yĕggu lĕṁcha nim̐ka ninnu
gomuna nīvu gorina koriga līḍerĕnu

(||emi||)
viṁṭim̐gā nī suddulĕllā vīnula paṁḍuvagānu
sŏṁṭulu sodiṁchi ninnu sŏlayanela
kaṁṭim̐gā nī sem̐talu kannula paṁḍuvagānu
aṁṭi muṭṭi ninnu bāsa laḍuganelā

(||emi||)
nammidim̐gā nī guṇālu navvula paṁḍuvagānu
sammadiṁcha kim̐ka ninnu jarayanela
dŏmmim̐ gālu dŏkkidim̐gā domaḍi paṁḍugagānu
simmusum̐ gŏnagoḽlam̐ jĕnaganelā

(||emi||)
sesugŏṁṭim̐gā ninnum̐ jeri nichcha paṁḍugagā
vesālagu niṁkānu vem̐ḍugonela
vāsido na nnelidivi vachchi śhrīveṁkaḍeśhum̐ḍa
āsala ninni paṁḍuga lāḍugŏnelā