ఏమి చెప్పేరే యెమ్మె లెందాఁకా మాతో
(॥పల్లవి॥)
ఏమి చెప్పేరే యెమ్మె లెందాఁకా మాతో
వేమరు నవ్వినదే వేడుకసరసము
(॥ఏమి॥)
పగటున వనితలు పదివేలు గలిగినా
మగఁడుచేపట్టినదే మరి దేవులు
తగిలి యన్నిటా వేగుదాఁకా నొడఁబర చినా
అగపడి చెల్లుబడియైనదే మాట
(॥ఏమి॥)
కొలువులు సేసియెంత కూరిములు గోసరినా
పిలుపు గలిగినదే ప్రియము
కలపుకోలున నెంత కాఁపురము సేసినాను
సలిగెతోడిదే సతమైన మన్నన
(॥ఏమి॥)
జమళిపొంతనాలు సారె నెంత గూడినాను
తమిగలిగినదే తగులాయము
గుమిగా నిన్ను నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడు
సమరతివిభవాలే చవులకుఁ జవులు
(||pallavi||)
emi sĕppere yĕmmĕ lĕṁdām̐kā mādo
vemaru navvinade veḍugasarasamu
(||emi||)
pagaḍuna vanidalu padivelu galiginā
magam̐ḍusebaṭṭinade mari devulu
tagili yanniḍā vegudām̐kā nŏḍam̐bara sinā
agabaḍi sĕllubaḍiyainade māḍa
(||emi||)
kŏluvulu sesiyĕṁta kūrimulu gosarinā
pilubu galiginade priyamu
kalabugoluna nĕṁta kām̐puramu sesinānu
saligĕdoḍide sadamaina mannana
(||emi||)
jamaḽibŏṁtanālu sārĕ nĕṁta gūḍinānu
tamigaliginade tagulāyamu
gumigā ninnu nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
samaradivibhavāle savulagum̐ javulu