Emi seppedi neesuddu lemta ledu

ఏమి చెప్పేది నీసుద్దు లెంత లేదు
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పేది నీసుద్దు లెంత లేదు
దామెన గట్టేవు బొంకు తారుమారుగాను

(॥ఏమి॥)
చెప్పరాదు చూపరాదు నేసిననీచేఁతలైతే
ఆప్పటి బాసలు సేసే వందరిలోన
దుప్పటికొంగైతేను తొగరద్దినట్టున్నది
కుప్పళించేవు పంతాలు గుఱుతులుగాను

(॥ఏమి॥)
పట్టరాదు ముట్టరాదు పచ్చియైననీమేనైతే
పెట్టుకొనేవు ఆనలు పెద్దెలుఁగున
పట్టెమంచమయితేను పదునుగారుచున్నది
దిట్టకూళతనములు దిగుపారించేవు

(॥ఏమి॥)
వినరాదు అనరాదు వీనుల నీగుణములు
వొనరించేవు సాకిరు లొకటొకటే
చెనకి శ్రీవేంకటేశ చెక్కులైతేఁ జెమటూరీ
యెనసితివి ఆసోదా లింకా నాపైఁ జల్లేవు

(||pallavi||)
emi sĕppedi nīsuddu lĕṁta ledu
dāmĕna gaṭṭevu bŏṁku tārumārugānu

(||emi||)
sĕpparādu sūbarādu nesinanīsem̐talaide
āppaḍi bāsalu sese vaṁdarilona
duppaḍigŏṁgaidenu tŏgaraddinaṭṭunnadi
kuppaḽiṁchevu paṁtālu guṟudulugānu

(||emi||)
paṭṭarādu muṭṭarādu pachchiyainanīmenaide
pĕṭṭugŏnevu ānalu pĕddĕlum̐guna
paṭṭĕmaṁchamayidenu padunugārusunnadi
diṭṭagūḽadanamulu digubāriṁchevu

(||emi||)
vinarādu anarādu vīnula nīguṇamulu
vŏnariṁchevu sāgiru lŏgaḍŏgaḍe
sĕnagi śhrīveṁkaḍeśha sĕkkulaidem̐ jĕmaḍūrī
yĕnasidivi āsodā liṁkā nābaim̐ jallevu