ఏమి చెప్పేది నీభాగ్య మిన్నిటా రమణుఁడ
(॥పల్లవి॥)
ఏమి చెప్పేది నీభాగ్య మిన్నిటా రమణుఁడ
దోమటి మిమ్ముఁ జూచి సంతోసమాయ నాకు
(॥ఏమి॥)
మొక్కలానఁ దనచనుమొనలు నీవీఁపు సోఁక
చిక్కుదీసీ నీనెరులు చెలియ
వెక్కసపుఁ గొప్పులోని విరులు నీపై రాల
నిక్కి కుంచెవేసీని నీపైఁ గేలు చాఁచి
(॥ఏమి॥)
కందువతోఁ దొడాఁ దొడాఁ గదియ నీవద్ద నుండి
గందము వూసీ నీకుఁ గలికి
చిందేటిచెమటనీటి చిత్తడి నీమేన నంట
చెంది సొమ్ములెల్లాఁ బెట్టి సింగారించీ నీకును
(॥ఏమి॥)
చలువమోవితీపువాసన నీముక్కున నిండ
తిలకము ను దిద్దీఁ దెఱవ
కలసితి నన్ను శ్రీ వేంకటేశ బేఁటెరాయ
అలమీఁ గాఁగిట నాపె నాయములు గరఁగా
(||pallavi||)
emi sĕppedi nībhāgya minniḍā ramaṇum̐ḍa
domaḍi mimmum̐ jūsi saṁtosamāya nāgu
(||emi||)
mŏkkalānam̐ danasanumŏnalu nīvīm̐pu som̐ka
sikkudīsī nīnĕrulu sĕliya
vĕkkasabum̐ gŏppuloni virulu nībai rāla
nikki kuṁchĕvesīni nībaim̐ gelu sām̐si
(||emi||)
kaṁduvadom̐ dŏḍām̐ dŏḍām̐ gadiya nīvadda nuṁḍi
gaṁdamu vūsī nīgum̐ galigi
siṁdeḍisĕmaḍanīḍi sittaḍi nīmena naṁṭa
sĕṁdi sŏmmulĕllām̐ bĕṭṭi siṁgāriṁchī nīgunu
(||emi||)
saluvamovidībuvāsana nīmukkuna niṁḍa
tilagamu nu diddīm̐ dĕṟava
kalasidi nannu śhrī veṁkaḍeśha bem̐ṭĕrāya
alamīm̐ gām̐giḍa nābĕ nāyamulu garam̐gā