Emi seduraa naa manasu yemtainaam battamgalenu

ఏమి సేతురా నా మనసు యెంతైనాఁ బట్టఁగలేను
Language

(॥పల్లవి॥)
ఏమి సేతురా నా మనసు యెంతైనాఁ బట్టఁగలేను
కామించినదాననై కడుఁ గొసరేఁగాక

(॥ఏమి॥)
సేసవెట్టిన పతిని చేరి నన్ను మఱచేవా
పాసివుండనోపక పదరేఁగాక
నా సొమ్ముయినవాఁడవు నన్ను నీవు యెడసేవా
ఆసలాసలను నీకు నేఁకరేఁగాక

(॥ఏమి॥)
చేపట్టినవాఁడవు చిత్తానఁ బెట్టకుండేవా
ఆఁపలే కెచ్చరించి మాఁటాడేఁగాక
నాపొందు సేసేవాఁడవు నాకు వింతయయ్యేవా
తీపుల నీమోవి చూచి తిమిరేఁగాక

(॥ఏమి॥)
సేవగొనేటి వాఁడవు చేసన్నకు లోనుగావా
కావరపుఁ దమితోఁ గదిమేఁగాక
నావాఁడవైవాఁడవు నన్నిప్పడు గూడవా
శ్రీవేంకటేశుఁడ బత్తిఁ జెనకేఁ గాక

(||pallavi||)
emi sedurā nā manasu yĕṁtainām̐ baṭṭam̐galenu
kāmiṁchinadānanai kaḍum̐ gŏsarem̐gāga

(||emi||)
sesavĕṭṭina padini seri nannu maṟasevā
pāsivuṁḍanobaga padarem̐gāga
nā sŏmmuyinavām̐ḍavu nannu nīvu yĕḍasevā
āsalāsalanu nīgu nem̐karem̐gāga

(||emi||)
sebaṭṭinavām̐ḍavu sittānam̐ bĕṭṭaguṁḍevā
ām̐pale kĕchchariṁchi mām̐ṭāḍem̐gāga
nābŏṁdu sesevām̐ḍavu nāgu viṁtayayyevā
tībula nīmovi sūsi timirem̐gāga

(||emi||)
sevagŏneḍi vām̐ḍavu sesannagu lonugāvā
kāvarabum̐ damidom̐ gadimem̐gāga
nāvām̐ḍavaivām̐ḍavu nannippaḍu gūḍavā
śhrīveṁkaḍeśhum̐ḍa battim̐ jĕnagem̐ gāga