Emi sedum jeliyaa yivigo naa samdamulu

ఏమి సేతుఁ జెలియా యివిగో నా చందములు
Language

(॥పల్లవి॥)
ఏమి సేతుఁ జెలియా యివిగో నా చందములు
కామించి ఇంతలో వచ్చి కరుణించె విభుఁడు

(॥ఏమి॥)
కొత్త కొత్త సిగ్గులతో గుట్టున నుందానఁగాని
చిత్త మాతనిఁదలఁచి చిమ్మిరేఁగీనే
హత్తిన తమకములు అడఁచు కుందానఁగాని
గుత్తపు వలపు లోలో గుబ్బతిలీనే

(॥ఏమి॥)
నడుమనే సెలవుల నవ్వులు నవ్వేఁగాని
వుడినోనితలపోఁత లుమ్మగిలీనే
వడదేరక బీరాన వట్టిమాఁట లాడెఁగాని
నిడువాలుఁజూపులైతే నివ్వెరగందీనే

(॥ఏమి॥)
కమ్మటి నూరకే మోముకళలు దేరీఁగాని
కమ్మఁ జెమటలు మేఁ గారుకొనీనే
యిమ్మల శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
కమ్ముకొన్న సంతోసాలు కావరించీనే

(||pallavi||)
emi sedum̐ jĕliyā yivigo nā saṁdamulu
kāmiṁchi iṁtalo vachchi karuṇiṁchĕ vibhum̐ḍu

(||emi||)
kŏtta kŏtta siggulado guṭṭuna nuṁdānam̐gāni
sitta mādanim̐dalam̐si simmirem̐gīne
hattina tamagamulu aḍam̐su kuṁdānam̐gāni
guttabu valabu lolo gubbadilīne

(||emi||)
naḍumane sĕlavula navvulu navvem̐gāni
vuḍinonidalabom̐ta lummagilīne
vaḍaderaga bīrāna vaṭṭimām̐ṭa lāḍĕm̐gāni
niḍuvālum̐jūbulaide nivvĕragaṁdīne

(||emi||)
kammaḍi nūrage momugaḽalu derīm̐gāni
kammam̐ jĕmaḍalu mem̐ gārugŏnīne
yimmala śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
kammugŏnna saṁtosālu kāvariṁchīne