Emi sedu ramanumda yettainaa melu

ఏమి సేతు రమణుఁడ యెట్టైనా మేలు
Language

(॥పల్లవి॥)
ఏమి సేతు రమణుఁడ యెట్టైనా మేలు
దీమసము యింతంతని తెలియలేఁ గాని

(॥ఏమి॥)
నిను నే దూరుటకంటే నిచ్చలాన నుంటే మేలు
మనసిజుఁడు రేఁచక మానలేఁడుగాని
మనవి చెప్పుట కంటె మోనాన నుండితే మేలు
తనువులో తలపోఁత తమకించీఁగాని

(॥ఏమి॥)
కలసి పాయట కంటె కడల నుండితే మేలు
తలఁపు నాజవ్వనము తగిలించీఁగాని
పిలిచి వాదించు కంటె బిగువుతో నుంటే మేలు
చెలుల బుద్దులు నన్నుఁ జిమ్మిరేఁచిఁగాని

(॥ఏమి॥)
నిక్కి చూచి వేఁగుకంటె నిద్రవోయిన మేలు
మొక్కలపుటాస కన్ను ముయ్యనీదు గాని
చక్కని శ్రీవేంకటేశ సతిఁ గూడితివి మేలు
పక్కున సిగ్గు లిందాఁకా భ్రమయించీఁగాని

(||pallavi||)
emi sedu ramaṇum̐ḍa yĕṭṭainā melu
dīmasamu yiṁtaṁtani tĕliyalem̐ gāni

(||emi||)
ninu ne dūruḍagaṁṭe nichchalāna nuṁṭe melu
manasijum̐ḍu rem̐saga mānalem̐ḍugāni
manavi sĕppuḍa kaṁṭĕ monāna nuṁḍide melu
tanuvulo talabom̐ta tamagiṁchīm̐gāni

(||emi||)
kalasi pāyaḍa kaṁṭĕ kaḍala nuṁḍide melu
talam̐pu nājavvanamu tagiliṁchīm̐gāni
pilisi vādiṁchu kaṁṭĕ biguvudo nuṁṭe melu
sĕlula buddulu nannum̐ jimmirem̐sim̐gāni

(||emi||)
nikki sūsi vem̐gugaṁṭĕ nidravoyina melu
mŏkkalabuḍāsa kannu muyyanīdu gāni
sakkani śhrīveṁkaḍeśha sadim̐ gūḍidivi melu
pakkuna siggu liṁdām̐kā bhramayiṁchīm̐gāni