ఏమి సేతమె చెలి ఇవి నిన్నేఁపఁగఁ జొచ్చె
(॥పల్లవి॥)
ఏమి సేతమె చెలి ఇవి నిన్నేఁపఁగఁ జొచ్చె
నీ మగనిఁ దోడితెచ్చే నిమ్మలాన నుండవే
(॥ఏమి॥)
చిత్తజునడిదాలైన చిగురాకులె మేయఁజొచ్చె
హత్తి కోవిలల కెందు నాజ్ఞ లేదు
బత్తిలేక వసంతుని పంటలెల్లా వీటిఁ బుచ్చె
కొత్తలైన చిలుకల కొవ్వు మాన్చలేరు
(॥ఏమి॥)
పోరుచుఁ జెఱకువింటి పూవుటమ్ము లంటఁ జొచ్చె
ఆరయ తుమ్మిదలకు నాజ్ఞలేదు
నేరుపుతో చందరువెన్నెలలు గ్రోలఁజొచ్చె
బీరపుఁ జకోరాలబింక ముడుపలేరు
(॥ఏమి॥)
మదనవేదాలెల్లా మాటల నమలఁజొచ్చె
అదె శారికల కెందు నాజ్ఞలేదు
కదిసి ఇంతలో శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ గూడె
యెదిరించి వీరెల్లా నేమీఁజేయలేరు
(||pallavi||)
emi sedamĕ sĕli ivi ninnem̐pam̐gam̐ jŏchchĕ
nī maganim̐ doḍidĕchche nimmalāna nuṁḍave
(||emi||)
sittajunaḍidālaina sigurāgulĕ meyam̐jŏchchĕ
hatti kovilala kĕṁdu nājña ledu
battilega vasaṁtuni paṁṭalĕllā vīḍim̐ buchchĕ
kŏttalaina silugala kŏvvu mānchaleru
(||emi||)
porusum̐ jĕṟaguviṁṭi pūvuḍammu laṁṭam̐ jŏchchĕ
āraya tummidalagu nājñaledu
nerubudo saṁdaruvĕnnĕlalu grolam̐jŏchchĕ
bīrabum̐ jagorālabiṁka muḍubaleru
(||emi||)
madanavedālĕllā māḍala namalam̐jŏchchĕ
adĕ śhārigala kĕṁdu nājñaledu
kadisi iṁtalo śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ gūḍĕ
yĕdiriṁchi vīrĕllā nemīm̐jeyaleru