Emi pamtaalaadeve yiduvamtivaamdu veemde

ఏమి పంతాలాడేవే యిటువంటివాఁడు వీఁడే
Language

(॥పల్లవి॥)
ఏమి పంతాలాడేవే యిటువంటివాఁడు వీఁడే
కామించి నేఁ గైకొంటిఁ గాదనఁగఁగలవా

(॥ఏమి॥)
యెలయించనేరుతువా ఇన్నిటా జాణఁ డితఁడు
పిలువఁగనేరుతువా పెలు చితఁడు
పలికించనేరుతువా బలవంతుఁడితఁడు
కలయఁగనేరుతువా గట్టువాయ ఇతఁడు

(॥ఏమి॥)
నగ నీవోపుదువా నాలికాఁడు యీతఁడు
తగులఁనోపుదువా దంట ఇతఁడు
బిగియఁగనోపుదువా ప్రియవాది యీతఁడు
జగడించనోపుదువా సరసుఁ డితఁడు

(॥ఏమి॥)
చెనకగఁగలవా చిక్కనివాఁ డితఁడు
తనిఇంచగలవా వుద్దండుఁ డితఁడు
యెనసెను శ్రీవేంకటేశుఁ డిన్నిటా నన్ను
పెనఁగఁగఁగలవా ముప్పిరి ఘనుఁ డితఁడు

(||pallavi||)
emi paṁtālāḍeve yiḍuvaṁṭivām̐ḍu vīm̐ḍe
kāmiṁchi nem̐ gaigŏṁṭim̐ gādanam̐gam̐galavā

(||emi||)
yĕlayiṁchaneruduvā inniḍā jāṇam̐ ḍidam̐ḍu
piluvam̐ganeruduvā pĕlu sidam̐ḍu
paligiṁchaneruduvā balavaṁtum̐ḍidam̐ḍu
kalayam̐ganeruduvā gaṭṭuvāya idam̐ḍu

(||emi||)
naga nīvobuduvā nāligām̐ḍu yīdam̐ḍu
tagulam̐nobuduvā daṁṭa idam̐ḍu
bigiyam̐ganobuduvā priyavādi yīdam̐ḍu
jagaḍiṁchanobuduvā sarasum̐ ḍidam̐ḍu

(||emi||)
sĕnagagam̐galavā sikkanivām̐ ḍidam̐ḍu
taniiṁchagalavā vuddaṁḍum̐ ḍidam̐ḍu
yĕnasĕnu śhrīveṁkaḍeśhum̐ ḍinniḍā nannu
pĕnam̐gam̐gam̐galavā muppiri ghanum̐ ḍidam̐ḍu