ఏమి నోము నోచెనో యింతక తొల్లి
(॥పల్లవి॥)
ఏమి నోము నోచెనో యింతక తొల్లి
నీ మనసురా మెలఁగి నీకు దేవులాయను
(॥ఏమి॥)
యెంత వలచినదో యీ యింతి నీకును
వింతవింతమాట లాడి వేఁడుకొనీని
పొంతనా లెట్ల నీతో బోసఁగఁగూడెనో
చెంతల నేపొద్దు నిన్నుఁ జేరి యెడవాయదు
(॥ఏమి॥)
కామినికి నీమీఁదికాంక్ష ఇఁక నెట్టిదో
నీమోమే చూచుకొంటా నిలుచున్నది
ప్రేమతో యేసగినానఁ బెండాడెనొ నిన్ను
చేముంచి నీమనసులు చేకొనీఁ దానిన్నిటా
(॥ఏమి॥)
యీయలమేల్‌మంగ నీకు నెట్టిచుట్టరికమో
ఆయితమై నీవురమునందె వున్నది
కాయజకేళి కూడిన కందువవేళ యెట్టిదో
పాయపు శ్రీవేంకటేశ ప్రబలె నీకృపను
(||pallavi||)
emi nomu nosĕno yiṁtaga tŏlli
nī manasurā mĕlam̐gi nīgu devulāyanu
(||emi||)
yĕṁta valasinado yī yiṁti nīgunu
viṁtaviṁtamāḍa lāḍi vem̐ḍugŏnīni
pŏṁtanā lĕṭla nīdo bosam̐gam̐gūḍĕno
sĕṁtala nebŏddu ninnum̐ jeri yĕḍavāyadu
(||emi||)
kāminigi nīmīm̐digāṁkṣha im̐ka nĕṭṭido
nīmome sūsugŏṁṭā nilusunnadi
premado yesaginānam̐ bĕṁḍāḍĕnŏ ninnu
semuṁchi nīmanasulu segŏnīm̐ dāninniḍā
(||emi||)
yīyalamelmaṁga nīgu nĕṭṭisuṭṭarigamo
āyidamai nīvuramunaṁdĕ vunnadi
kāyajageḽi kūḍina kaṁduvaveḽa yĕṭṭido
pāyabu śhrīveṁkaḍeśha prabalĕ nīkṛpanu