Emi nerudune nenu innidaam daam derinaamdu

ఏమి నేరుతునే నేను ఇన్నిటాఁ దాఁ దేరినాఁడు
Language

(॥పల్లవి॥)
ఏమి నేరుతునే నేను ఇన్నిటాఁ దాఁ దేరినాఁడు
సాములు సేయఁ దనతో సరిదాననటవే

(॥ఏమి॥)
సరసానఁ దా నన్ను సన్నసేసి పిలిచితే
అరసి నేను గోర నంటనటవే
పొరిఁబొరిఁ దా నన్ను బొమ్మల జంకించి తేను
సరిగా నేను చలము సాదించనటవే

(॥ఏమి॥)
కోరి బెట్టిమాటలను కూరిమిఁదాఁ గొసరితే
తేరకొన నేఁ దన్నుఁ దిట్టినటవే
బీరమునఁ గొంగువట్టి పెనఁగి తాఁ బైకొంటే
తారుకాణగాఁ జన్నుల దాఁకించనటవే

(॥ఏమి॥)
తలయెత్తితా నన్నుఁ దప్పక చూచితేను
మెలుపుఁగన్నులనవ్వి మీరనటవే
అలమేలుమంగ నేఁదానట్టె శ్రీవేంకటేశుఁడు
కలసె నిందుకుఁదన్ను గద్దింతునటవే

(||pallavi||)
emi nerudune nenu inniḍām̐ dām̐ derinām̐ḍu
sāmulu seyam̐ danado saridānanaḍave

(||emi||)
sarasānam̐ dā nannu sannasesi piliside
arasi nenu gora naṁṭanaḍave
pŏrim̐bŏrim̐ dā nannu bŏmmala jaṁkiṁchi tenu
sarigā nenu salamu sādiṁchanaḍave

(||emi||)
kori bĕṭṭimāḍalanu kūrimim̐dām̐ gŏsaride
teragŏna nem̐ dannum̐ diṭṭinaḍave
bīramunam̐ gŏṁguvaṭṭi pĕnam̐gi tām̐ baigŏṁṭe
tārugāṇagām̐ jannula dām̐kiṁchanaḍave

(||emi||)
talayĕttidā nannum̐ dappaga sūsidenu
mĕlubum̐gannulanavvi mīranaḍave
alamelumaṁga nem̐dānaṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍu
kalasĕ niṁdugum̐dannu gaddiṁtunaḍave