ఏమి నేర్చితివి యిటువంటి పనులు
(॥పల్లవి॥)
ఏమి నేర్చితివి యిటువంటి పనులు
కామిని మోహము గైకొనరాదా
(॥ఏమి॥)
మలయుచు నూరక మగువ వుండఁగా
చెలరేఁగి యేల చెనకేవు
తలుపుమాఁటునను తలవంచుకొనఁగ
పలుకుల నూరక భ్రమించేవు
(॥ఏమి॥)
చిఱునవ్వులతో చెలియ వుండఁగా
చెఱఁగువట్టి గురిసేసేవు
పఱపుమీఁదనే పాదము లొత్తఁగ
కఱకుల నిటు చనుఁగవ యంటేవు
(॥ఏమి॥)
సేవలు సేయుచు శ్రీపతి యుండఁగ
మోవి మోవితోమాపేవు
శ్రీవేంకటేశ్వర జిగిఁగూడే వనిత
భావఁబులఁ గడుఁబస రెఁచేవు
(||pallavi||)
emi nersidivi yiḍuvaṁṭi panulu
kāmini mohamu gaigŏnarādā
(||emi||)
malayusu nūraga maguva vuṁḍam̐gā
sĕlarem̐gi yela sĕnagevu
talubumām̐ṭunanu talavaṁchugŏnam̐ga
palugula nūraga bhramiṁchevu
(||emi||)
siṟunavvulado sĕliya vuṁḍam̐gā
sĕṟam̐guvaṭṭi gurisesevu
paṟabumīm̐dane pādamu lŏttam̐ga
kaṟagula niḍu sanum̐gava yaṁṭevu
(||emi||)
sevalu seyusu śhrībadi yuṁḍam̐ga
movi movidomābevu
śhrīveṁkaḍeśhvara jigim̐gūḍe vanida
bhāvam̐bulam̐ gaḍum̐basa rĕm̐sevu