ఏమి గట్టుకొంటివి నీ విందువంకను
(॥పల్లవి॥)
ఏమి గట్టుకొంటివి నీ విందువంకను
సాము లిందులోనే చేసి సాదించవయ్యా
(॥॥)
అలిగి నేనే తిట్టితినంటా నాపెతోఁజెప్పి
తెలిపి నీవే తగవు దిద్దవచ్చేవా
వెలయ నిద్దరికిని వేఁడికోపములు రేఁచి
చెలఁగి నడుమ నీవు సీతు గాయవయ్యా
(॥॥)
పెనఁగి నే నాపె నొట్టు వెట్టితి నంటాఁజెప్పి
పొనిగి యంతటిలోనే పొందు సేసేవా
వొనరఁగఁ దరితీపు లూరించి వూరించి
యెనలేని వేడుకల నీఁదులాడవయ్యా
(॥॥)
నాలితో నాపె నేను నవ్వితినంటాఁ జెప్పి
తాలిమితోడుతనే సంతముసేసేవా
యీలీల శ్రీ వేంకటేశ యేలితి విద్దరి మమ్ము
పోలిమి మావలపు మైఁబూసుకొనవయ్యా
(||pallavi||)
emi gaṭṭugŏṁṭivi nī viṁduvaṁkanu
sāmu liṁdulone sesi sādiṁchavayyā
(||||)
aligi nene tiṭṭidinaṁṭā nābĕdom̐jĕppi
tĕlibi nīve tagavu diddavachchevā
vĕlaya niddarigini vem̐ḍigobamulu rem̐si
sĕlam̐gi naḍuma nīvu sīdu gāyavayyā
(||||)
pĕnam̐gi ne nābĕ nŏṭṭu vĕṭṭidi naṁṭām̐jĕppi
pŏnigi yaṁtaḍilone pŏṁdu sesevā
vŏnaram̐gam̐ daridību lūriṁchi vūriṁchi
yĕnaleni veḍugala nīm̐dulāḍavayyā
(||||)
nālido nābĕ nenu navvidinaṁṭām̐ jĕppi
tālimidoḍudane saṁtamusesevā
yīlīla śhrī veṁkaḍeśha yelidi viddari mammu
polimi māvalabu maim̐būsugŏnavayyā