Emi galigina nene yimudugomdumgaaga

ఏమి గలిగిన నేనే యిముడుకొందుఁగాక
Language

(॥పల్లవి॥)
ఏమి గలిగిన నేనే యిముడుకొందుఁగాక
వేమారును నీగుట్టు వెలివేతునా

(॥ఏమి॥)
చెలరేఁగి నీవు నాతో చెప్పినమాటలెల్లా
అలరి తెరమాఁటున నాపె వినెను
చెలువుఁడ నేనే చెప్పితినంటా నీవు
పలికేవు నే నిన్ను బయలుపరతునా

(॥ఏమి॥)
ననిచి నాతో నాపెనునవ్విన నవ్వులెల్లా
తనకుఁదానే యెట్టో తాఁ జూపెను
ఇనుమడిగా నేనేయెరిఁగించితినంటా
గునిసేవు నే నిన్ను కొరత లెన్నుదునా

(॥ఏమి॥)
ఆపెసేసినగుఱుతు లట్టెచూపినవెల్లా
వైపుగాఁ దెలిసె నెవ్వరు చెప్పిరో
యేపున శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
రూపించేవు నే నిన్ను రొచ్చులు సేయుదునా

(||pallavi||)
emi galigina nene yimuḍugŏṁdum̐gāga
vemārunu nīguṭṭu vĕlivedunā

(||emi||)
sĕlarem̐gi nīvu nādo sĕppinamāḍalĕllā
alari tĕramām̐ṭuna nābĕ vinĕnu
sĕluvum̐ḍa nene sĕppidinaṁṭā nīvu
paligevu ne ninnu bayalubaradunā

(||emi||)
nanisi nādo nābĕnunavvina navvulĕllā
tanagum̐dāne yĕṭṭo tām̐ jūbĕnu
inumaḍigā neneyĕrim̐giṁchidinaṁṭā
gunisevu ne ninnu kŏrada lĕnnudunā

(||emi||)
ābĕsesinaguṟudu laṭṭĕsūbinavĕllā
vaibugām̐ dĕlisĕ nĕvvaru sĕppiro
yebuna śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
rūbiṁchevu ne ninnu rŏchchulu seyudunā