(॥పల్లవి॥)
ఏమి గలిగె మీ కిందునను
ఆమని జవ్వన మణఁచఁగఁ దగునా
(॥ఏమి॥)
చనవున నొకపరి సతి నినుఁ గొసరిన
కనలి నీవు నలుగఁగఁ దగునా
తనువులు బడలెను తగ నిద్దరికిని
మనసులచలములు మానఁగఁదగదా
(॥ఏమి॥)
అంటకుమని చెలి యటు నినుఁ గొసరిన
నంటునీకు మానఁగఁ దగునా
ఇంటిలోననే ఇద్దరు నలసితి-
రంటినకోపము లాఁపఁగఁ దగదా
(॥ఏమి॥)
నటనలకుఁ జెలియ నాఁటఁగఁ జూచిన
సటలకుఁ దలవంచఁగఁ దగునా
ఘటనల శ్రీ వేంకటపతి కలసితి-
వటుగన చెలితో నవు డిది దగదా
(||pallavi||)
emi galigĕ mī kiṁdunanu
āmani javvana maṇam̐sam̐gam̐ dagunā
(||emi||)
sanavuna nŏgabari sadi ninum̐ gŏsarina
kanali nīvu nalugam̐gam̐ dagunā
tanuvulu baḍalĕnu taga niddarigini
manasulasalamulu mānam̐gam̐dagadā
(||emi||)
aṁṭagumani sĕli yaḍu ninum̐ gŏsarina
naṁṭunīgu mānam̐gam̐ dagunā
iṁṭilonane iddaru nalasidi-
raṁṭinagobamu lām̐pam̐gam̐ dagadā
(||emi||)
naḍanalagum̐ jĕliya nām̐ṭam̐gam̐ jūsina
saḍalagum̐ dalavaṁcham̐gam̐ dagunā
ghaḍanala śhrī veṁkaḍabadi kalasidi-
vaḍugana sĕlido navu ḍidi dagadā