ఎంగిలిపొందులు నీకు నింతప్రియమా
(॥పల్లవి॥)
ఎంగిలిపొందులు నీకు నింతప్రియమా
జంగిలివలపులేల సానఁబెట్టేవే
(॥ఎంగి॥)
మంతనమునను నేము మాటలాడుకొనఁగాను
వింతదానవు నీవేల వినవచ్చేవే
బంతి నాతఁడును నేను పాలకూ ళ్లారగించగా
అంతట నుండి నీవేల అట్టె చూచేవే
(॥ఎంగి॥)
సారెకు నేమిద్దరము సన్నలు సేసుకొనఁగ
తారుకాణ నీవేల అర్తాలు చెప్పేవే
నారువోసినట్టు నేము నవ్వులిట్టె నవ్వుకోఁగా
దూరుగాను నీవేఁటికి తోడు నవ్వేవే
(॥ఎంగి॥)
ఇక్కువల శ్రీవేంకటేశుఁడు నేఁ గూడఁగాను
గక్కన వాకిట నేల కాచుకుండేవే
నిక్కమై నే మిద్దరము నివ్వెరగుతో నుండఁగ
వొక్కటై కూడితివి నీవును మాతోనే
(||pallavi||)
ĕṁgilibŏṁdulu nīgu niṁtapriyamā
jaṁgilivalabulela sānam̐bĕṭṭeve
(||ĕṁgi||)
maṁtanamunanu nemu māḍalāḍugŏnam̐gānu
viṁtadānavu nīvela vinavachcheve
baṁti nādam̐ḍunu nenu pālagū ḽlāragiṁchagā
aṁtaḍa nuṁḍi nīvela aṭṭĕ sūseve
(||ĕṁgi||)
sārĕgu nemiddaramu sannalu sesugŏnam̐ga
tārugāṇa nīvela ardālu sĕppeve
nāruvosinaṭṭu nemu navvuliṭṭĕ navvugom̐gā
dūrugānu nīvem̐ṭigi toḍu navveve
(||ĕṁgi||)
ikkuvala śhrīveṁkaḍeśhum̐ḍu nem̐ gūḍam̐gānu
gakkana vāgiḍa nela kāsuguṁḍeve
nikkamai ne middaramu nivvĕragudo nuṁḍam̐ga
vŏkkaḍai kūḍidivi nīvunu mādone