(॥పల్లవి॥)
ఏమేమి సేసినాను ఇతవే కాక
కామించి మీరును నిచ్చకము లాడవలదా
(॥ఏమే॥)
ఇద్దరిమాతలఁపులు నేకమై వుండఁగాను
సుద్దలేమి చెప్పేరే సుదతులాల
కొద్దిమీరి వలపులు కోటికొండలై వుండఁగా
అద్దో పాయవచ్చునా ఆలికి మగనికి
(॥ఏమే ॥)
యెప్పుడు నాతఁడు నేను ఇయ్యకొనివుండఁగాను
తప్పకచూచే రదేమే తరుణులాల
వొప్పగువేడుకలలో నోలలాడుచుండఁగాను
అప్పుడే దూరవచ్చునా ఆలికి మగనికి
(॥ఏమే॥)
రవ్వ మొక్కరొకరము రతిఁ జొక్కి యుండఁగాను
నవ్వేరేలే యిప్పుడిట్టె నాతులాల
ఇవ్వల శ్రీవేంకటేశుఁ డీతఁడు
అవ్వలేమి నెంచనేలే ఆలికి మగనికి
(||pallavi||)
ememi sesinānu idave kāga
kāmiṁchi mīrunu nichchagamu lāḍavaladā
(||eme||)
iddarimādalam̐pulu negamai vuṁḍam̐gānu
suddalemi sĕppere sudadulāla
kŏddimīri valabulu koḍigŏṁḍalai vuṁḍam̐gā
addo pāyavachchunā āligi maganigi
(||eme ||)
yĕppuḍu nādam̐ḍu nenu iyyagŏnivuṁḍam̐gānu
tappagasūse rademe taruṇulāla
vŏppaguveḍugalalo nolalāḍusuṁḍam̐gānu
appuḍe dūravachchunā āligi maganigi
(||eme||)
ravva mŏkkarŏgaramu radim̐ jŏkki yuṁḍam̐gānu
navverele yippuḍiṭṭĕ nādulāla
ivvala śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍu
avvalemi nĕṁchanele āligi maganigi