ఏమీ నెఱఁగని సతి నింతసేతురా
(॥పల్లవి॥)
ఏమీ నెఱఁగని సతి నింతసేతురా
కోమలపు మనసులు కొలఁది నిలుచునా
(॥ఏమీ॥)
దగ్గరి నీవు నవ్వితే తరుణి కొప్పెల్లా వీడె
సిగ్గరి పెండ్లికూఁతురుఁ జిమ్మిరేఁతురా
దిగ్గన నీవు చూడఁగ దేహమెల్లాఁ జెమరించె
అగ్గల మాయ వలపు అంత కోపునా
(॥ఏమీ॥)
చెలితో మాటలాడఁగ చెక్కులెల్లాఁ బులకించె
పలుమారు నిందరితోఁ బచ్చినేతురా
నిలువున నొరగితే నిట్టూర్పు లవి రేఁగె
మలసితే దమకాలు మట్టున నిలుచునా
(॥ఏమీ॥)
పంతానఁ జేయివేసితే భామ నివ్వెరగుఁ బొందె
కాంతుఁడవు వొకమాటే కరగింతురా
వింతగా శ్రీవేంకటేశ వేడుకతోఁ గూడితివి
సంతసాలు మతిలోనఁ జాలునంటే మానునా
(||pallavi||)
emī nĕṟam̐gani sadi niṁtasedurā
komalabu manasulu kŏlam̐di nilusunā
(||emī||)
daggari nīvu navvide taruṇi kŏppĕllā vīḍĕ
siggari pĕṁḍligūm̐turum̐ jimmirem̐turā
diggana nīvu sūḍam̐ga dehamĕllām̐ jĕmariṁchĕ
aggala māya valabu aṁta kobunā
(||emī||)
sĕlido māḍalāḍam̐ga sĕkkulĕllām̐ bulagiṁchĕ
palumāru niṁdaridom̐ bachchinedurā
niluvuna nŏragide niṭṭūrbu lavi rem̐gĕ
malaside damagālu maṭṭuna nilusunā
(||emī||)
paṁtānam̐ jeyiveside bhāma nivvĕragum̐ bŏṁdĕ
kāṁtum̐ḍavu vŏgamāḍe karagiṁturā
viṁtagā śhrīveṁkaḍeśha veḍugadom̐ gūḍidivi
saṁtasālu madilonam̐ jālunaṁṭe mānunā