ఏమీ నెఱఁగని కన్నె నింత సేతురా
(॥పల్లవి॥)
ఏమీ నెఱఁగని కన్నె నింత సేతురా
కామిని వనుచు నెట్టు కనుగొనవచ్చునే
(॥ఏమీ॥)
నేరుపుననే వచ్చి నీకుఁగలవలపెల్ల
దారకానఁ దోడాపెకుఁ దగిలించితి
పోరచిగా నీతోను పొందుసేసే వారికెల్లా
యేరీతి సేతువో నిన్ను నెట్టు నమ్మవచ్చునే
(॥ఏమీ॥)
మంచిమాటలెల్లా నాడి మగువను నీమగని
కంచము పొత్తు నెట్టు కలపితివే
పొంచి నీచుట్టరికానఁ బోరలేటి వారికల్లా
యెంచుకొని మఱి యింకా నేమిసేతువో
(॥ఏమీ॥)
చే వట్టుకొని వచ్చి శ్రీవేంకటేశ్వరునిఁ
దోవ రాకుండాఁ బాదము దొక్కించితివి
వావిరినీపొరుగులవారినెల్లా నీతనితో
చేవమీరిపెండ్లిడు సేతువమ్మా యిపుడూ
(||pallavi||)
emī nĕṟam̐gani kannĕ niṁta sedurā
kāmini vanusu nĕṭṭu kanugŏnavachchune
(||emī||)
nerubunane vachchi nīgum̐galavalabĕlla
dāragānam̐ doḍābĕgum̐ dagiliṁchidi
porasigā nīdonu pŏṁdusese vārigĕllā
yerīdi seduvo ninnu nĕṭṭu nammavachchune
(||emī||)
maṁchimāḍalĕllā nāḍi maguvanu nīmagani
kaṁchamu pŏttu nĕṭṭu kalabidive
pŏṁchi nīsuṭṭarigānam̐ boraleḍi vārigallā
yĕṁchugŏni maṟi yiṁkā nemiseduvo
(||emī||)
se vaṭṭugŏni vachchi śhrīveṁkaḍeśhvarunim̐
dova rāguṁḍām̐ bādamu dŏkkiṁchidivi
vāvirinībŏrugulavārinĕllā nīdanido
sevamīribĕṁḍliḍu seduvammā yibuḍū