Emee nanam baniledu yiyyagonude melu

ఏమీ ననఁ బనిలేదు యియ్యకొనుటే మేలు
Language

(॥పల్లవి॥)
ఏమీ ననఁ బనిలేదు యియ్యకొనుటే మేలు
కామించినవాఁడవు కలయఁగ నేరవా

(॥ఏమీ॥)
గట్టిగా నీవు సేసిన కల్లలైనా నిజముగా
నెట్టన నిలుపఁబెట్టనేరవా నీవు
దిట్టవై వాడలోసతిఁ దెచ్చుకొన్నవాఁడవు
చుట్టరికాలు కలయఁ జూపి చెప్పనేరవా

(॥ఏమీ॥)
వచ్చి వచ్చి యాపె నెరవాదిఁ జేసినవాఁడవు
నిచ్చలునుఁ గొనియాడ నేరవా నీవు
కచ్చు పెట్టి వల పొడిఁగట్టు కొన్నవాఁడవు
దిచ్చరివై మమ్ము సమ్మతించఁజేయనేరవా

(॥ఏమీ॥)
పుక్కట నన్నిటా నీవు బోగించినవాఁడవు
నెక్కొని ప్రియము చెప్పనేరవా నీవు
యిక్కువ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
గక్కన నామోము చూచి కడు నవ్వనేరవా

(||pallavi||)
emī nanam̐ baniledu yiyyagŏnuḍe melu
kāmiṁchinavām̐ḍavu kalayam̐ga neravā

(||emī||)
gaṭṭigā nīvu sesina kallalainā nijamugā
nĕṭṭana nilubam̐bĕṭṭaneravā nīvu
diṭṭavai vāḍalosadim̐ dĕchchugŏnnavām̐ḍavu
suṭṭarigālu kalayam̐ jūbi sĕppaneravā

(||emī||)
vachchi vachchi yābĕ nĕravādim̐ jesinavām̐ḍavu
nichchalunum̐ gŏniyāḍa neravā nīvu
kachchu pĕṭṭi vala pŏḍim̐gaṭṭu kŏnnavām̐ḍavu
dichcharivai mammu sammadiṁcham̐jeyaneravā

(||emī||)
pukkaḍa nanniḍā nīvu bogiṁchinavām̐ḍavu
nĕkkŏni priyamu sĕppaneravā nīvu
yikkuva śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
gakkana nāmomu sūsi kaḍu navvaneravā