Eme visaarimche vemtavani gaddu neegu

ఏమే విచారించే వెంతవని గద్దు నీకు
Language

(॥పల్లవి॥)
ఏమే విచారించే వెంతవని గద్దు నీకు
నాములువార నవ్వేటి ననుపుకత్తెలము

(॥ఏమే॥)
అగ్గమై కంబము మాటునందు గొలువుసేయఁగ
వెగ్గళించి యెవ్వరంటా విచారించేవు
నిగ్గుల నీవెఱఁగవా నీతో సరసమాడి
సిగ్గులు విడిపించేటి చెలిమికత్తెలము

(॥ఏమే॥)
వెనకదిక్కుననుండి వింజామర వేయఁగాను
మొనసి యదరిపాటు మోము చూచేవు
ననుపు మఱచితివా నయగారాల నీచేత
పనులు సేఇంచుకొన్న పంతగతైలము

(॥ఏమే॥)
కడనుండి వచ్చి నిన్నుఁ గాఁగిట నేఁ గూడఁగాను
వెడమోవి లంచమిచ్చి వేఁడుకొనేవు
తడవి శ్రీ వేంకటేశ తగవు నీవెఱఁగవా
అడరి నీవు మన్నించే యాసోదకతైలము

(||pallavi||)
eme visāriṁche vĕṁtavani gaddu nīgu
nāmuluvāra navveḍi nanubugattĕlamu

(||eme||)
aggamai kaṁbamu māḍunaṁdu gŏluvuseyam̐ga
vĕggaḽiṁchi yĕvvaraṁṭā visāriṁchevu
niggula nīvĕṟam̐gavā nīdo sarasamāḍi
siggulu viḍibiṁcheḍi sĕlimigattĕlamu

(||eme||)
vĕnagadikkunanuṁḍi viṁjāmara veyam̐gānu
mŏnasi yadaribāḍu momu sūsevu
nanubu maṟasidivā nayagārāla nīseda
panulu seiṁchugŏnna paṁtagadailamu

(||eme||)
kaḍanuṁḍi vachchi ninnum̐ gām̐giḍa nem̐ gūḍam̐gānu
vĕḍamovi laṁchamichchi vem̐ḍugŏnevu
taḍavi śhrī veṁkaḍeśha tagavu nīvĕṟam̐gavā
aḍari nīvu manniṁche yāsodagadailamu