Eme vatti tarideebu lela seseve

ఏమే వట్టి తరితీపు లేల సేసేవే
Language

(॥పల్లవి॥)
ఏమే వట్టి తరితీపు లేల సేసేవే
ప్రేమగల చోటున పెనఁగఁగఁ దగదే

(॥ఏమే॥)
నెట్టనఁ బతి విలిచీ నిన్ను చేసన్నలేఁటికే
చుట్టరికము చెప్పఁగా సుద్దులేఁటివే
గుట్టుతోడ రమణునిఁ గూడుటే మేలు యిఁక
బట్టబయలు పందిలివెట్టనేఁటికే

(॥ఏమే॥)
కొంగువట్టితియ్యఁగా నిక్కువలు చెప్పఁగనేలే
ముంగిటఁ జన్నులంటఁగ మొక్కులేఁటివే
సంగతిగా దేవులవై చనవు చేకొంట మేలు
యింగితపుటాసలనేల దొంతివెట్టేవే

(॥ఏమే॥)
బూవాన నుంటివి మేలుపొందు లేమిచూచేవే
చేవదేరఁ గాఁగిలించి సిగ్గులేఁటికే
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁజెందె నలమేల్‌మంగవు
కైవసమై కతలెన్ని గాదెఁ బోసేవే

(||pallavi||)
eme vaṭṭi taridību lela seseve
premagala soḍuna pĕnam̐gam̐gam̐ dagade

(||eme||)
nĕṭṭanam̐ badi vilisī ninnu sesannalem̐ṭige
suṭṭarigamu sĕppam̐gā suddulem̐ṭive
guṭṭudoḍa ramaṇunim̐ gūḍuḍe melu yim̐ka
baṭṭabayalu paṁdilivĕṭṭanem̐ṭige

(||eme||)
kŏṁguvaṭṭidiyyam̐gā nikkuvalu sĕppam̐ganele
muṁgiḍam̐ jannulaṁṭam̐ga mŏkkulem̐ṭive
saṁgadigā devulavai sanavu segŏṁṭa melu
yiṁgidabuḍāsalanela dŏṁtivĕṭṭeve

(||eme||)
būvāna nuṁṭivi melubŏṁdu lemisūseve
sevaderam̐ gām̐giliṁchi siggulem̐ṭige
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐jĕṁdĕ nalamel‌maṁgavu
kaivasamai kadalĕnni gādĕm̐ boseve