Eme sinnadaanavaa yimtiro neevu

ఏమే చిన్నదానవా యింతిరో నీవు
Language

(॥పల్లవి॥)
ఏమే చిన్నదానవా యింతిరో నీవు
నీ మగనిఁ జూడరాదా నిన్ను మెచ్చఁగాను

(॥ఏమే॥)
శిరసేల వంచేవే సిగ్గులేల పెంచేవే
బెరసి యాతఁడు నీతోఁబెనఁగఁగాను
మరగి యేల పట్టీవే మాటలేల చుట్టేవే
అరుదై యాతడు సుద్దు లడుఁగఁగాను

(॥ఏమే॥)
చన్నులేల మూసేవే సన్నలేల సేసేవే
చెన్నుమీర నిన్నితఁడు చెనకఁగాను
వున్నతి నెంత లోఁగేవే వొడ్డుక యేల వీఁగేవే
వన్నెల నితఁడు నీకు వలవఁగాను

(॥ఏమే॥)
బలిమినేల నవ్వేవే పంతములేల తవ్వేవే
యెలమి శ్రీవేంకటేశుఁ డెనయఁగాను
అలమేలుమంగవు నీ వక్కున నెట్టొరసేవే
మలసి యీతఁడు నీకు మరుగఁగాను

(||pallavi||)
eme sinnadānavā yiṁtiro nīvu
nī maganim̐ jūḍarādā ninnu mĕchcham̐gānu

(||eme||)
śhirasela vaṁcheve siggulela pĕṁcheve
bĕrasi yādam̐ḍu nīdom̐bĕnam̐gam̐gānu
maragi yela paṭṭīve māḍalela suṭṭeve
arudai yādaḍu suddu laḍum̐gam̐gānu

(||eme||)
sannulela mūseve sannalela seseve
sĕnnumīra ninnidam̐ḍu sĕnagam̐gānu
vunnadi nĕṁta lom̐geve vŏḍḍuga yela vīm̐geve
vannĕla nidam̐ḍu nīgu valavam̐gānu

(||eme||)
baliminela navveve paṁtamulela tavveve
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍĕnayam̐gānu
alamelumaṁgavu nī vakkuna nĕṭṭŏraseve
malasi yīdam̐ḍu nīgu marugam̐gānu