Eme nee ramanumdu yeduda nunnaamdu veemde

ఏమే నీ రమణుఁడు యెదుట నున్నాఁడు వీఁడె
Language

(॥పల్లవి॥)
ఏమే నీ రమణుఁడు యెదుట నున్నాఁడు వీఁడె
దోమటిగా మోవి యిచ్చి దొమ్మి రేఁచఁ గలవా

(॥ఏమే॥)
సళువుఁ జూపుల నీవు సారెకుఁ జూచేవు నీ -
కులుకు గుబ్బలనేమి కుచ్చి యెత్తేవా
పలుకుఁ బంతాలెల్లాఁ బచరించే వదియేమే
కెలసి రతుల నంత గెలువఁగఁ గలవా

(॥ఏమే॥)
చెనకి బొమ్మల జంకించేవు చలపట్టి నీ -
మొనగోరి వాఁడేమి మోఁచి వచ్చీని
పెనఁగుచు గుంపెనలఁ బెచ్చువెరిగేవేమె
మనసుమర్మము లంట మరిగించఁ గలవా

(॥ఏమే॥)
తక్కక యాసల గబ్బితనాలు చూపేవు నీ -
యక్కజపఁ గాఁగిలేమి యంటుకొనీనా
ఇక్కడ శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
మిక్కిలి ఇందుకంటె మితిమీరఁ గలవా

(||pallavi||)
eme nī ramaṇum̐ḍu yĕduḍa nunnām̐ḍu vīm̐ḍĕ
domaḍigā movi yichchi dŏmmi rem̐sam̐ galavā

(||eme||)
saḽuvum̐ jūbula nīvu sārĕgum̐ jūsevu nī -
kulugu gubbalanemi kuchchi yĕttevā
palugum̐ baṁtālĕllām̐ basariṁche vadiyeme
kĕlasi radula naṁta gĕluvam̐gam̐ galavā

(||eme||)
sĕnagi bŏmmala jaṁkiṁchevu salabaṭṭi nī -
mŏnagori vām̐ḍemi mom̐si vachchīni
pĕnam̐gusu guṁpĕnalam̐ bĕchchuvĕrigevemĕ
manasumarmamu laṁṭa marigiṁcham̐ galavā

(||eme||)
takkaga yāsala gabbidanālu sūbevu nī -
yakkajabam̐ gām̐gilemi yaṁṭugŏnīnā
ikkaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
mikkili iṁdugaṁṭĕ midimīram̐ galavā