Emduvoyye nenu tana imtilone vunnadaana

ఎందువొయ్యే నేను తన ఇంటిలొనే వున్నదాన
Language

(॥పల్లవి॥)
ఎందువొయ్యే నేను తన ఇంటిలొనే వున్నదాన
కందువలేల తడవీఁ గట్టిపెట్టుమనవే

(॥ఎందు॥)
చలపట్టి నాతోను జాణతనా లాడియాడి
వలపులేఁటికిఁ జల్లి వద్దనఁ గదే
తలపెట్టి యప్పటినిఁ దగులనాడీ మాట
మలసి యాసుద్దు లిఁక మన్నించు మనవే

(॥ఎందు॥)
వేసరక నాతోను వేడుకకు నవ్వునవ్వి
ఆలేల పెట్టీ మొక్కెననఁగదవే
పొసరించి వేడుకకు పొందుసేసె నొకనాఁడు
లాసుక ఆచేఁతలు తలఁచేఁగ నేఁడనవే

(॥ఎందు॥)
మొలకనాచన్నులు ముట్టిముట్టి కళరేఁచి
అలయించనేల రమ్మనఁగదవే
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు
కలసె నన్నిఁక నిట్టె కరుణించుమనవే

(||pallavi||)
ĕṁduvŏyye nenu tana iṁṭilŏne vunnadāna
kaṁduvalela taḍavīm̐ gaṭṭibĕṭṭumanave

(||ĕṁdu||)
salabaṭṭi nādonu jāṇadanā lāḍiyāḍi
valabulem̐ṭigim̐ jalli vaddanam̐ gade
talabĕṭṭi yappaḍinim̐ dagulanāḍī māḍa
malasi yāsuddu lim̐ka manniṁchu manave

(||ĕṁdu||)
vesaraga nādonu veḍugagu navvunavvi
ālela pĕṭṭī mŏkkĕnanam̐gadave
pŏsariṁchi veḍugagu pŏṁdusesĕ nŏganām̐ḍu
lāsuga āsem̐talu talam̐sem̐ga nem̐ḍanave

(||ĕṁdu||)
mŏlaganāsannulu muṭṭimuṭṭi kaḽarem̐si
alayiṁchanela rammanam̐gadave
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu
kalasĕ nannim̐ka niṭṭĕ karuṇiṁchumanave