Emdunnavi nee nijaalu yemaaya nemdu

ఎందున్నవి నీ నిజాలు యేమాయ నేఁడు
Language

(॥పల్లవి॥)
ఎందున్నవి నీ నిజాలు యేమాయ నేఁడు
ముందుముందే నీ కప్పటి మూరెఁడునోరు

(॥ఎందు॥)
యెవ్వతె మాటలోకాని ఇప్పుడిట్టె వినవచ్చె
నివ్వటిల్లఁ బవళించె నీఇంటిలోన
దివ్వెవెలుఁగున నీడ దిష్టముగఁ గానవచ్చె
వువ్విళ్లూర నాకె వలచున్నాఁడ నందువు

(॥ఎందు॥)
యెటువంటిదోకాని ఇదె వాసనలు వచ్చె
మటమాయ దోమతెర మంచములోన
గటనఁ బన్నీ రందుండి కాలువలు గట్టి వచ్చె
ఇటు నాకెవయసు మీఁ దెత్తితినే నందువు

(॥ఎందు॥)
యెంతనేరుపరో కానియెదురుగఁ దానె వచ్చె
సంతైననీయురముపచ్చడములోన
ఇంతలోనె శ్రీవేంకటేశ నన్ను నేలితివి
పొంత నీయేకాంతము యెప్పుడు దాఁచనందువు

(||pallavi||)
ĕṁdunnavi nī nijālu yemāya nem̐ḍu
muṁdumuṁde nī kappaḍi mūrĕm̐ḍunoru

(||ĕṁdu||)
yĕvvadĕ māḍalogāni ippuḍiṭṭĕ vinavachchĕ
nivvaḍillam̐ bavaḽiṁchĕ nīiṁṭilona
divvĕvĕlum̐guna nīḍa diṣhṭamugam̐ gānavachchĕ
vuvviḽlūra nāgĕ valasunnām̐ḍa naṁduvu

(||ĕṁdu||)
yĕḍuvaṁṭidogāni idĕ vāsanalu vachchĕ
maḍamāya domadĕra maṁchamulona
gaḍanam̐ bannī raṁduṁḍi kāluvalu gaṭṭi vachchĕ
iḍu nāgĕvayasu mīm̐ dĕttidine naṁduvu

(||ĕṁdu||)
yĕṁtanerubaro kāniyĕdurugam̐ dānĕ vachchĕ
saṁtainanīyuramubachchaḍamulona
iṁtalonĕ śhrīveṁkaḍeśha nannu nelidivi
pŏṁta nīyegāṁtamu yĕppuḍu dām̐sanaṁduvu