ఎందుండి విచ్చేసితివి ఇపుడు మా ఇంటికి
(॥పల్లవి॥)
ఎందుండి విచ్చేసితివి ఇపుడు మా ఇంటికి
చెంది సేవలు నేనేమి సేతుఁ జెప్పవయ్యా
(॥ఎందుం॥)
కన్నుల నిద్దురదేరీ గట్టినీతురుము జారీ
చెన్నగునీ మొగమున సిగ్గుదేరీని
నున్నని చెక్కులవెంట నోసలిచెమట గారీ
యెన్నఁగ నీవున్నజాడ యిదియేఁటిదయ్యా
(॥ఎందుం॥)
నిట్టూరువులు రేఁగీ నీమోవిఁ గెంపులు రాఁగీ
చుట్టుకొన్నపచ్చడముచుంగు లూఁగీని
పెట్టినకంకణములు బిగువువదలి వాఁగీ
వెట్టదీరఁ గాఁగిటికి వేడుకపడేవయ్యా
(॥ఎందుం॥)
చిత్తమేఁటికో లాసీ చేఁతలు బయలుసేసీ
హత్తి వెన్నెలలు నవ్వులందుఁ గాసీని
యిత్తల శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
బత్తితో నన్నేలితివి బాగులాయనయ్యా
(||pallavi||)
ĕṁduṁḍi vichchesidivi ibuḍu mā iṁṭigi
sĕṁdi sevalu nenemi sedum̐ jĕppavayyā
(||ĕṁduṁ||)
kannula nidduraderī gaṭṭinīdurumu jārī
sĕnnagunī mŏgamuna sigguderīni
nunnani sĕkkulavĕṁṭa nosalisĕmaḍa gārī
yĕnnam̐ga nīvunnajāḍa yidiyem̐ṭidayyā
(||ĕṁduṁ||)
niṭṭūruvulu rem̐gī nīmovim̐ gĕṁpulu rām̐gī
suṭṭugŏnnabachchaḍamusuṁgu lūm̐gīni
pĕṭṭinagaṁkaṇamulu biguvuvadali vām̐gī
vĕṭṭadīram̐ gām̐giḍigi veḍugabaḍevayyā
(||ĕṁduṁ||)
sittamem̐ṭigo lāsī sem̐talu bayalusesī
hatti vĕnnĕlalu navvulaṁdum̐ gāsīni
yittala śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
battido nannelidivi bāgulāyanayyā